Pawan Kalyan Tweets :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యమైన ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా మనల్ని తిట్టిన వారు ఇక నుంచి పొగుడుతారని.. వారి మాటలు విని పొంగిపోయి వాళ్లపై ప్రశంసలు కురిపించవద్దని వారి ట్రాప్‌లో పడవద్దని జనసైనికులకు పిలుపునిచ్చారు. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి అందరికీ పిలుపునిచ్చారు. [tw]






ఇప్పటిదాకా తిట్టి ఇప్పుడు పవన్‌ను పొగిడే వారెవరు ?


పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకూ తిట్టిన వారు ఇప్పుడు ఎందుకు పొగుడుతారన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విపరీతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసినా.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అనేక సార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. 


జనసేనను దెబ్బకొట్టేందుకు కొత్త స్ట్రాటజీనా ?


అయితే ఇప్పుడు హఠాత్తుగా పొగుడుతారని పవన్ కల్యాణ్‌కు ఎందుకు అనిపిచిందో కానీ.. ఈ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌ను అభినందించడం ద్వారా.. ఆయనను మంచి చేసుకోవాలన్న వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించాలని అనుకుంటోందని.. ఆ సమాచారం పవన్ కల్యాణ్‌కు తెలియడంతోనే ఇలాంటి ట్వీట్ చేశారని అంటున్నారు. సాధారణంగా పవన్ కల్యాణ్‌ను పొగిడితే ఆయన అభిమానులు... ఆ పొగిడిన వారికి మద్దతుగా మాట్లాడతారు.  ఇలా వైఎస్ఆర్‌సీపీ నేతలు  పవన్‌ను పొగిడితే..అభిమానులు కూడా ఆ నేతల్ని పొగుడుతారు. దీని వల్ల సీన్ మారిపోతుందని.. రెండు పార్టీలు మిత్రపక్షాలన్న అభిప్రాయం కలుగుతుందని.. అది జనసేనను మరింత ఇబ్బంది పెడుతుందన్న అభిప్రాయం ఉంది. 


జనసేన ఫ్యాన్స్ పవన్ పిలుపును అర్థం చేసుకుంటారా ?


వైఎస్ఆర్‌సీపీ కొత్త స్ట్రాటజిస్ట్‌ను నియమించుకుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు ఆ వైపు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందేమో కానీ.. అనుకున్నట్లుగా.. ఇప్పటి వరకూ తిట్టిన వారు ఎవరైనా అభినందిస్తే మాత్రం పవన్ కల్యాణ్‌కు ఖచ్చితమైన సోర్స్ ఉందనే అనుకోవాలి.