Pavan Kalyan On Chandrababu : చంద్రబాబు మొన్న వన్ సైడ్ లవ్ అన్నారు ..  ఈ మధ్య వార్ వన్ సైడ్ అన్నారని  ముందు చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చాక పొత్తులపై మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చంద్రబాబు సిద్ధం అంటే..  పవన్ కల్యాణ్ కూడా రెడీ అన్నట్లుగా మాట్లాడటంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ చెప్పలేదని..  కరోనా కారణంగానే బీజేపీ తో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నానని చెప్పారు. జేపీ  నడ్డా మీటింగ్ లకు కూడా హాజరు కాలేనని స్పష్టం చేశారు.  బీజేపీతో చెడిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం  2014, 2019 లో  తగ్గాను కానీ 2024లో తగ్గటానికి సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  ఈ సారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. తాను ఓడిపోయినా ఆగలేదని..పదవి ఉంటే ఎక్కువ చేస్తానని స్పష్టం చేశారు. 


కోనసీమ అల్లర్లకు వైఎస్ఆర్‌సీపీనే కారణం


జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని్ మంగళగిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించారు. ఇందులో మూడు తీర్మానాలు చేశారు.   కోనసీమ అల్లర్లు బహుజన ఐక్యతపై దాడి అని .. ఇది వైఎస్ఆర్‌సీపీ కుట్రేనని పవన్ స్పష్టం చేశారు.  కోనసీమలో శాంతి కమిటీ ఏర్పాటు చేస్తూ జనసేన తీర్మానం తీసిందని ప్రకటించారు. కోనసీమ అల్లర్లను కులఘర్షణగా మార్చేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. కులరహిత సమాజం ఉండాలని అంబేద్కర్ (Ambedkar) కల అని తెలిపారు. కులాలు లేని సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ అన్నారని గుర్తుచేశారు. భారతదేశం కులాలతో ముడిపడి ఉందన్నారు. కుల విద్వేషణ చేసిన నేల ఇదని దుయ్యబట్టారు. మనకు ఆంధ్ర అనే భావన లేదని, కులం అనే భావనే ఉందని తప్పుబట్టారు. పక్క రాష్ట్రంలో కులం కంటే తెలంగాణ అనే భావనే ఉందని తెలిపారు. 


అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారు


అన్ని కులాలవాళ్లు ఓట్లు వేస్తేనే వైఎస్ఆర్‌సీపీ (YేీCP) గెలిచిందన్నారు. ఆ సంగతి మర్చిపోయి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కోనసీమలో చిచ్చు అంబేద్కర్ పేరుతో వచ్చింది కాదని, అది వైసీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు అని ఆరోపించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉందని నిఘావర్గాలకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ కూడా రాష్ట్రాన్ని హెచ్చరించిందని పవన్‌ కల్యాణ్ తెలిపారు. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారని ..ఇది దురదృష్టకరమన్నారు. మనమేమో నిజాయితీగా ఉండాలి.. అవినీతి , దాడులు చేసే వారి పాలనలో బతకాలని .. ఇదే పౌరుడిగా తనకు ఇబ్బందన్నారు. 


ఎస్ఆర్‌సీపీ అంటే రౌడీ మూక.. గూండాల గుంపు


ఇసుక దందాను అరికడతామని చెప్పి ఒకే కంపెనీకి ఇచ్చారన్నారు. వైఎస్ఆర్‌సీపీ అంటే రౌడీ మూక.. గూండాల గుంపుగా అభివర్ణించారు. కోనసీమ అల్లర్లతో జనసేనకు ఏదో అవుతుందనుకుంటే మీ అమాయకత్వమేనని వైఎస్ఆర్‌సీపీ నేతలకు తేల్చి చెప్పారు. మీరు ఎంత రుద్దాలనుకున్నా మాకు అంటుకోదన్నారు. కమ్మవారిని వైసీపీ వర్గ శత్రువుగా ప్రకటిచిందని..  రఘురామ కారణంగా క్షత్రియ వర్గాన్ని కూడా శత్రువుగా ప్రకటించారని ఇదీ వైసీపీ సిద్ధాంతం అని పవన్ విమర్శించారు.