Pawan Kalyan has deprived AP BJP of even Hindutva agenda : సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ కల్యాణ్ చేసిన రాజకీయం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. బీజేపీ సూచనలో చేశారని కొంత మంది .. కాదు సొంతంగానే హిందూత్వ ఫేస్‌గా దక్షిణాదిలో ఎదగాలని పవన్ కల్యాణ్ కొత్త ప్రయత్నం చేశారని మరికొందరు వాదిస్తున్నారు. అందులో ఏది నిజమో తెలియదు కానీ.. ఏపీ బీజేపీ నేతలు గట్టిగా హిందూత్వ వాదనను వినిపించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వారు ఏదైనా మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడినట్లుగా ఉటోంది కానీ.. తమను ఎలివేట్ చేస్తుందని అనుకోలేకపోతున్నారు. 


హిందూత్వ ఎజెండాను ఓన్ చేసుకున్న పవన్ కల్యాణ్ 


ఏపీ బీజేపీ నేతలు ఇతర ప్రజాసమస్యల అంశంలో ఎలా స్పందించినా హిందూత్వ అంశంలో మాత్రం దూకుడుగా ఉంటారు. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు ఆలయాల యాత్ర కూడా చేపట్టారు. ఎందుకంటే బీజేపీకి హిందూత్వ పేటెంట్ ఉంది. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా వారు హిందూత్వ అంశాలు ప్రచారాస్త్రమైనప్పుడు ఘాటుగానే స్పందించేవారు. అలాంటిది లడ్డూ నెయ్యి కల్తీ అంశం హాట్ టాపిక్ అయినప్పుడు బీజేపీ నేతల వాయిస్ ఎక్కడా వినిపించలేదు. చివరికి తిరుపతిలో చురుకుగా ఉండే బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కన్నా.. జనసేన నేత కిరణ్ రాయలే లడ్డూ వివాదంలో హైలెట్ అయ్యారు. 


ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !


ఏపీ బీజేపీ నేతలు స్పందిస్తే పవన్ వెనుక నడిచినట్లే 


ఇక రాష్ట్రవ్యాప్తంగానే కాదు ఏపీ నుంచి కొత్త హిందూత్వ ఫేస్ గా పవన్ కల్యాణ్ హైలెట్ అయ్యారు. ఉత్తరాదిలోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ అయ్యారు . అంటే టోటల్ గా హిందూత్వ వాదం ఆయన చేతుల్లోకి వచ్చింది. కాస్త లాజికల్ గా ఆలోచిస్తే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా బీజేపీ నేతల స్టేట్‌మెంట్లే కనిపించాలి. ఉత్తరాదిలో కనిపించాయి కానీ దక్షిణాదిలో మాత్రం పూర్తిగా పవనే కనిపించారు. చివరికి తమిళనాడులో కూడా పవనే  హైలెట్ అయ్యారు. అంటే ఎలా చూసినా పవన్ కల్యాణ్ హిందూత్వాన్ని హైజాక్ చేశారని అనుకోవచ్చు. కావాలని చేశారా లేకపోతే.. బీజేపీతో కలిసి అవగాహనతో చేశారా అన్నది వారికే తెలియాలి. కానీ పవన్ కల్యాణ్ కారణంగా ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలకు ఎజెండా లేకుండా పోయింది. 


కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి ! 


ఉక్కపోతకు గురవుతున్న బీజేపీ సీనియర్లు 


ఓ వైపు అధికారకూటమిలో ఉండటం వల్ల పెద్దగా పనేమీ ఉండటం లేదు. నామినేటెడ్ పదవులు కూడా ఎంత మందికి వస్తాయో తెలియడం లేదు. పార్టీ పరంగా చేపట్టాల్సిన పనులు కూడా లేవు. అందుకే ఎక్కువ మంది నేతలు బయట కనిపించడం లేదు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి సీనియర్లకు అసలు వాయిస్ లేకుండా పోయింది. కనీసం కూటమిలో లేకపోయినా ఏదో ఓ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. చివరికి హిందూత్వ ఎజెండాను కూడా పవన్ లాక్కున్నారని వారు ఉక్కపోతుకు గురవుతున్నారు.