Pawan Kalyan :కుల, మతాలతో రాజకీయం చేస్తే దేశం విచ్చిన్నం అవుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రలో పవన పాల్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.   సిద్ధులు తిరిగిన ప్రాంతం రాయలసీమ అని ఇక్క పేదరికం రాజ్యమేలుతోందన్నారు.  పేదరికానికి కులం లేదు. బాధిత కౌలు రైతు కుటుంబాల్లో రెడ్లే అధికం.  కౌలు రైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదన్నారు.   ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలి. రాయలసీమ చదువుల నేల.. పద్యం పుట్టిన భూమి. ఇంటింటికీ చీప్‌ లిక్కర్‌ వచ్చిందని యువత చెబుతున్నారన్నారు. 


కౌలు రైతులకు కార్డులు ఇవ్వడం లేదు !


రైతులను ఉద్ధరిస్తున్నట్టు, కౌలు రైతులను ఆదుకుంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదంతా కష్టపడినా చేతికాడ ముద్ద నోటిలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు.  పంటలు దెబ్బతింటే ప్రభుత్వమిచ్చే పథకాలు కౌలు రైతుల దరి చేరడంలేదు. వెరసి పంటలు సాగు చేయలేక కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కాదు.. మూడేళ్ల వ్యవధిలో ఉమ్మడి కడప జిల్లాలో 175 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే.. 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఒక్కరు కూడా కౌలు రైతు లేరని.. అంటే లెక్కలు సరిగ్గా వేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని కనీసం సాగు పెట్టుబడులు రాని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మాభిమానం చంపుకోలేక పలువురు రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు.


ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతలే ప్రజారాజ్యాన్ని విలీనం చేయించారు !


ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారని.... ప్రజారాజ్యం ఉండి ఉంటే  ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  ను వ్యక్తులపై పోరాటం చేయనని..  భావాలపైనే చేస్తాన్నారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చేాయలన్నారు. అలా చేయకపోతే ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. పేదరికానికి కులం ఉండదని గుర్తు చేశారు. కుల రాజకీయాల కోసం తాను జనసేన పార్టీని స్థాపించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వాటి గురించి తాను ఆలోచించనన్నారు. 


కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని !


వారసత్వ రాజకీయాలకు కొంత మేరకైనా అడ్డుకట్ట వేయాల్సి ఉందని పవన్ వ్యాఖ్యానించారు.  అన్న పట్టించుకోకపోవడంతోనే చెల్లెలు వేరే రా,్ట్రంలో పార్టీ పెట్టారని గుర్తు చేసారు. రాయలసీమలో బడుగు, బలహీన వర్గాల గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. అన్నికుల్లాలో పేదలున్నారని గుర్తు చేశారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.  ముందుగా జిల్లాలో పులివెందుల నియోజకవర్గం  నుంచే చెక్కుల పంపిణీ ప్రారంభించారు. బాధిత కౌలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు.