ట్విట్టర్‌లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. ఒకరి గురించి ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ముందుగా ఈ ట్వీట్ వార్‌ను బండ్ల గణేష్ ప్రారంభించారు. విజయసాయిరెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్లతో బండ్ల గణేష్ విమర్శలు ప్రారంభించారు.
తర్వాత విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. " వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ విరుచుకుపడ్డారు.
అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయిరెడ్డేనన్నట్లుగా మరో ట్వీట్ చేశారు.
మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
బండ్ల గణేష్ ట్వీట్లు విజయసాయిరెడ్డిని బాధపెట్టేయేమో కానీ ఆయన కూడా స్పందించారు. ఆయన ట్వీట్ల భాష గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. ఉన్నత విద్యావంతుడైనప్పటికీ అత్యంత దిగువ స్థాయిలో ఆయన ట్వీట్ల లాంగ్వేజ్ ఉంటుంది. బండ్ల గణేష్ పైనా అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు.
విజయసాయిరెడ్డి స్పందిస్తే ఇక బండ్ల గణేష్ ఎందుకు ఊరుకుంటారు. వెంటనే స్పందించారు. ఒకటికి.. రెండు తిట్లతో ట్వీట్లు పెట్టారు.
విజయసాయిరెడ్డి , బండ్ల గణేష్ కు అసలు ఎక్కడా తేడా వచ్చింది..? వారి మధ్య ఉన్న గొడవలేమిటన్నది ఎవరికీతెలియదు. బండ్లకు ఎందుకు ఆవేశం వచ్చింది ? దాని వెనుక ఏం ఉంది అన్నది ఆయన బయటపెడితేనే తెలియాల్సి ఉంది.