Kavitha Comments: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంటే బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా తన బావ, మాజీ మంత్రి, సొంతపార్టీలో అత్యంత కీలకనేత హరీష్ రావు పైనే తీవ్ర ఆరోపణలు చేసి పొలిటికల్ హీట్ పీక్స్ కు తీసుకెళ్లారు. అంతేకాదు ఎంపీ సంతోష్ పై కూడా తీవ్ర స్దాయిలో విరుచుకుపడ్డారు కవిత. కాలేశ్వరం నిర్మాణంలో హరీష్ రావు అవినీతికి పాాల్పడలేదా.. అంటూ విమర్శలు మొదలు పెట్టిన కవిత సంతోష్ ,హరీష్ రావు ఇద్దరూ కలసి తన తండ్రి కేసీఆర్ పై అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి వీరిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ రెచ్చిపోయారు.
బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ పార్టీలో కీలక నేతలు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. హరీష్ రావు అయితే ఇంక చెప్పక్కర్లేదు. పార్టీలో కేసీఆర్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునేది కేటీఆర్, హరీష్ లే. మరి అంతలా పార్టీకి విధేయతగా ఉండే హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ తుఫాన్ కు కారణమైయ్యాయి. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తాజాగా సిబిఐ ఎంక్వరీకి సిఫార్సు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై మీడిాయా సమావేశం ఏర్పాటు చేసిన కవిత, బిఆర్ ఎస్ కు మద్దతుగా మాట్లడుతారని అంతా అనుకున్నారు. టార్గెట్ కాంగ్రెస్ గా ఆమె ప్రసంగం ఉంటుందని ఊహించారు. కానీ అందరి లెక్కలు తలకిందులైయ్యేలా సొంత పార్టీ బీఆర్ ఎస్ పై , నేరుగా బావ హరీష్ రావులనే విమర్శలతో ఢీ కొట్టింది కవిత..
అన్నతో కాదు.. యుద్దం బావతోనే..
గతంలో బీఆర్ ఎస్ లో నెలకొన్న అసంతృప్తిపై కేసీఆర్ కు కవిత రాసిన లేఖతో మొదలై చిచ్చు, తాజాగా హరీష్ రావు,సంతోష్ పై చేసిన విమర్శలతో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా సెగలు పుట్టిస్తోంది. తన తండ్రికి లేఖ, లీక్ తరువాత మీడియాతో మాట్లడిన కవిత బిఆర్‌ఎస్‌లో తన తండ్రి కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయని, ఆ దెయ్యాల వల్ల పార్టీ నష్టపోతోందని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాాత అనేకసార్లు నేరుగా పార్టీపై విమర్శలు చేసినప్పటికీ ఒక్క జగదీష్ రెడ్డి ప్రస్తావన తప్ప, బీఆర్ ఎస్ లో ఎవరినీ పేర్లు చెప్పలేదు. నేరుగా పేర్లు ప్రస్తావించి తీవ్ర స్దాయిలో విమర్శించలేదు. తాజాగా కవిత మాట్లడుతూ హరీష్ ,సంతోష్ వారి స్వార్ధం కోసం తన తండ్రిని వాడుకున్నారని, ఇప్పుడు సిబిఐ ఎంక్వరీ వరకూ పరిస్దితి తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. కవిత తాజాగా విమర్శల నేపధ్యంలో బిఆర్ ఎస్ లో విభేదాలు పీక్స్ చేరుకున్నాయని క్లారిటీ వచ్చినట్లయ్యింది. అంతేకాదు సొంత బావ హరీష్ రావుతో ఇకపై డైరెక్ట్ పొలిటికల్ వాార్ కు తాను సిద్దంగా ఉన్నాననే సంకేతాలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈరోజు వరకూ కేటీఆర్ కు కవితకు మధ్య చెడిందని, కేటీఆర్ పై కక్షతోనే ఇలా మాట్లడుతోందనే ఊహాగానాలకు చెక్ పెట్టేలా తెరపైకి హరీష్ పేరు తెచ్చి, నా కక్ష అన్నపై కాదు బావపై అన్నట్లుగా కవిత వ్యాఖ్యలతో ఓ క్లారిటీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
హరీష్ కు మద్దతుగా బిఆర్ ఎస్ పార్టీ..
కవిత వ్యాఖ్యలు తరువాత బీఆర్ ఎస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వరీ వేసిన తరువాత బిఆర్ ఎస్ పార్టీ ఉంటే ఎంత , పోతే ఎంత.. అంటూ కవిత అన్న మాటలు ఏకంగా పార్టీనేతల్లో తీవ్ర ఆగ్రహనికి కారణమైనట్లు తెలుస్తోంది. కవిత వర్సెస్ హరీష్ రావు వివాదంలో పార్టీ మద్దతు హరీష్ కే నంటూ బిఆర్ ఎస్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా క్లారిటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే కాలేశ్వరం పై సిబిఐ అంటూ కాంగ్రెస్ పాార్టీ ఇచ్చిన ఊహించని షాక్ లో ఉన్న బిఆర్ ఎస్ నేతలకు అంతకు మించి అన్నట్లుగా తాజాగా కవిత చేసిన విమర్శలపై హరీష్ రావు, సంతోష్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.