ఆంధ్రప్రదేశ్ మంత్రి  ఆర్కే రోజా ( RK Roja ) హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో ( YS VijayaLakshmi ) సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసంలో ( Sharmila House ) ఈ సమావేశం జరిగింది. తనకు మంత్రి పదవి లభించిన సందర్భంగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కొంత కాలంగా రోజా ( Minister Roja ) ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి కుదిరిందని రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి ప్రత్యేక  రాజకీయ విశేషం ఏమీ లేదంటున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్‌,  బెంగళూరుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో మరో నగదు బదిలీ పథకం- బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు రైతు ఖాతాల్లో వేయాలన్న సీఎం


పుట్టిన రోజు సందర్భంగా పాదయాత్రలో ఉన్న కుమార్తె షర్మిల ( Sharmila ) సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. కుమారుడు జగన్‌తో ( CM Jagan ) విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న కారణంగా విజయలక్ష్మితో భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరైనా సమావేశం అయినా అంతర్గత సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి రోజా మాత్రం విజయమ్మను ( Roja - Vijayamma Meet )  కలవడమే కాదు.. మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. విజయమ్మతో రోజా భేటీ దాదాపుగా గంట పాటు సాగినట్లుగా తెలుస్తోంది. వీరి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు తెలంగాణలో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనరపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.


శ్రీకాకుళం నుంచి ప్రారంభం - మే 4 నుంచి చంద్రబాబు జిల్లాల టూర్స్ !


కొత్తగా మంత్రులైన ( New Ministers ) వారు ఎవరూ విజయమ్మతో భేటీకి ప్రయత్నించలేదు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అని గుర్తుంచుకోలేదు. కానీ రోజా మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుని పలుమార్లు ప్రయత్నించి మరీ హైదరాబాద్ ( Hyderabad ) వెళ్లి సమావేశం అయ్యారు. ఈ అంశం వైఎస్ఆర్‌సీపీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. అయితే మంత్రి ఆర్కే రోజా  జగన్ అనుమతితోనే వచ్చి కలిసి ఉంటారని భావిస్తున్నారు . 


కర్నూలుకు జనసేనాని - 8వ తేదీన రైతు భరోసా యాత్ర !