Rampachodavaram MLA  Mariala Shirisha Devi  : అసెంబ్లీలో సభ్యులంతా ప్రమాణం చేశారు. అందరిలో కెల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ప్రమాణం ప్రత్యేకంగా నిలించింది. ఎందుకంటే ఆమె ఐదు నెలల కిందట అంగన్వాడి కార్యకర్త. ఇప్పుడు చట్టసభల్లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు.  


 రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి..


అయిదు నెలల క్రితం మిరియాల శిరీషాదేవి ఓ సామాన్య అంగన్‌వాడీ కార్యకర్త. భర్త టీడీపీలో చురుకుగా ఉంటున్నాడన్న కారణం చేత ఆమెను అన్నివిధాలుగా ఇబ్బందులు పెట్టారు.   అనేక ఫిర్యాదులు చేసి ఆమెను ఏదోలా ఉద్యోగం నుంచి తీయించాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు విసుగొచ్చి శిరీషాదేవినే  రాజీనామా చేశారు.  తన ఉద్యోగాన్ని వదులుకుని భర్తతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగిన ఆమెకు   అనూహ్యంగా టీడీపీ కూటమి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు లభించింది. అసాధ్యమనుకున్న విజయాన్ని సాధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళగా గుర్తింపు పొందారు...


వేధింపులతోపాటు బెదిరింపులు..


రంపచోడవరం అనగానే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు గుర్తొస్తారు. ఏజెన్సీని తన   అడ్డాగా మార్చుకుని టీడీపీలో ఉన్నవారిని అనేక విధాలుగా ఇబ్బందులు గురిచేశారు.  శిరీషాదేవి భర్త మిరియాల విజయభాస్కర్‌ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు. .టీడీపీలో చురుగ్గా ఉండేవారు.  భర్త టీడీపీలో ఉంటే శిరీషాదేవి రాజవొమ్మంగి మండలంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసేది. ఈక్రమంలోనే తెలుగు యువత అధ్యక్షునిగా చురుగ్గా ఉంటున్న విజయభాస్కర్‌ను కట్టడిచేసేందుకు ఎమ్మెల్పీ అనంత ఉదయబాబు, అతని అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు.   ఆయన వెనక్కు తగ్గకపోవడంతో భార్య ఉద్యోగాన్ని తీయిస్తామని బెదిరించారు.. అదీ పనిచేయకపోవడంతో ఐసీడీఎస్‌ సీడీపీవో వద్దకు వెళ్లి శిరీషాదేవిని తొలగించాలని లేకుంటే మిమ్మల్ని సస్పెండ్‌ చేయిస్తామని బెదిరించడంతో  పరిస్థితి గమనించి తానే స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు శిరీషాదేవి.. 


ఆకర్షించిన వాక్పటిమ...


ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం భర్తతోపాటు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొన్న శిరీషాదేవి తన వాక్పటిమతో నాయకత్వాన్ని ఆకర్షించారు.. ఈ క్రమంలోనే శిరీషాదేవి టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడడంతో ఆమెకు కూటమి నుంచి రంపచోడవరం టీడీపీ అభ్యర్ధిగా అదృష్టం వరించింది.  ప్రత్యర్ధి , సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిపై  9,139 ఓట్లు మెజార్టీతో గెలుపొంది 27ఏళ్ల అతిచిన్న వయస్సులో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు శిరీషా దేవి.


తొలిసారి టీడీపీకు పట్టం..


నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో రంపచోడవరం నియోజకవర్గం ఏర్పడిరది.. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపొందగా 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి, 2019లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులే గెలుపొందారు..   2014లో వైసీసీ అధికారంలోకి రాకపోవడంతో అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి టీడీపీలోకి చేరిపోయారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుందని అంతా అంచనా వేశారు.  అయితే అంచనాలను తారుమారు చేస్తూ మిరియాల శిరీషాదేవి టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలుపుబావుటా ఎరురవేశారు.