Kurnool district Aluru TDP ticket Race : కర్నూలు జిల్లా రాజకీయాలలో ఆ కుటుంబానికి మూడు దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేదు. ఆ కుటుంబానికి ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ కష్టాలు ఎదురవుతున్నాయా అంటే అవుననే చెప్పాలి... ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది.. టికెట్ కోసం అంతగా శ్రమ పడాల్సిన నేత ఎవరు అనేది స్టోరీలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా రాజకీయాలు కోట్ల కుటుంబం కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గత కాలంలో కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయంలో తిరుగులేకుండా ఉండేవారు. ప్రస్తుతం వారికి టికెట్ కష్టాలు ఎదురవుతున్నాయి.
కోట్ల కుటుంబానికి ఇంకా ఖరారు కానీ సీట్లు
2019 ఎన్నికల ముందు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆయన భార్య కోట్ల సుజాతమ్మ టిడిపి కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో బలిలో నిలిచారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి పార్టీకి చెందిన గుమ్మనూరు జయరాం చేతిలో ఓటమిని చూశారు. అయినప్పటికీ కోట్ల సుజాతమ్మ ఎక్కడ నిరాశ చెందకుండా ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలోని టిడిపి నేతలకు కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చారు.
ఆలూరుకు కోట్ల సుజాతమ్మను ఫైనల్ చేయని చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తూ నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు సాగింది. వైసిపి అభ్యర్థిగా గెలిచిన గుమ్మనూరు జయరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే మంత్రి గుమ్మనూరు జయరామ్ ను ఎదుర్కొంటూ ఆలూరు నియోజకవర్గం లో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 80% పైగా ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు ఇందులో ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మ పేరు ఇప్పటికీ ప్రకటించకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓకే కుటుంబానికి ఒక టికెట్ అనే పాలసీ ఉండడంతో కోట్ల కుటుంబానికి రెండో టికెట్ దక్కుతుందా లేదా అని మరో గంధన గోళం కూడా నెలకొంది.
ఆలూరు నియోజకవర్గంలో టిడిపి టికెట్ కోసం మరో ఇద్దరు ప్రయత్నాలు
ఆలూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి గా ఉన్న వైసీపీ నేత గుమ్మనూరు జయరాం ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి చేరారు. అయితే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గం టిడిపి టికెట్ కాకుండా గుంతకల్లు టిడిపి టికెట్‌ను ఆశిస్తూ ఉండడంతో ఆలూరు నియోజకవర్గం లో వైసీపీ పార్టీ నేతలు కూడా ఈ సారి టిడిపికి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టికెట్ సాధించుకుంటే విజయం ఈజీగా సాధించవచ్చు అని ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలానికి చెందిన టిడిపి నేత వైకుంఠం మల్లికార్జున చౌదరి, టిడిపి అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా ఆలూరు నియోజకవర్గం టికెట్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నియోజకవర్గం టిడిపి నేతలు అంతర్మధనంలో పడ్డారు.
కోట్ల సుజాతమ్మ వైపు నేతల మొగ్గు
మెజారిటీ టిడిపి నేతలు కోట్ల సుజాతమ్మకు టికెట్ కేటాయిస్తేనే విజయం సాధిస్తుందని చంద్రబాబు ముందు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. కోట్ల సుజాతమ్మను కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ మరో రెండు దశాబ్దాలు పట్టు కోల్పోవాల్సి ఉంటుందని వారు అధినేత ముందు వెల్లడించినట్లు సమాచారం. దీంతో అధినేత ఆలూరు అభ్యర్థిగా కోట్ల సుజాత అమ్మకు అవకాశం కల్పిస్తారా లేక వేరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది మరొక రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.