Kishan Reddy :   అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పష్టం చేశారు.  రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేని స‌మావేశమ‌ని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీలో వారిద్ద‌రూ కేవ‌లం సినిమాల‌కు సంబంధించిన అంశాల‌పైనే మాట్లాడుకున్నార‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ భేటీలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ గురించిన విష‌యాల‌ను అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను అడిగి మ‌రీ తెలుసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి డిన్న‌ర్ చేయాల‌ని అమిత్ షా భావించార‌న్నారు.  
 


అమిత్ షా - ఎన్టీఆర్‌ల మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదు !


మునుగోడు స‌భ‌కు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు పలు రకాల అనుమానాలు వస్తుండడంతో ఇద్దరి భేటీపై కిషన్‌రెడ్డి స్పందించారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి దాడిచేసి వందేళ్లు పూర్తయిన దృష్టా శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్‌ ముండా, ఏపీ డిప్యూడీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. సందర్భంగా 9 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?


బీజేపీ కోసం ఎన్టీఆర్ దేశవ్యాప్త ప్రచారం చేస్తారన్న కొడాలి నాని 
 


వీరి భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్రాధాన్యం ఉందని.. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని..బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని భావిస్తున్నట్లు వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చేందుకు అమిత్ షా యత్నిస్తున్నారని.. కొడాలి నాని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి స్పందించారు. ఇతర పార్టీల నేతల ఊహాగానాలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 


కవిత హస్తం ఉంటే చెప్పాల్సింది సీబీఐనా ? బీజేపీనా ? ముందస్తు ఆరోపణలు రాజకీయమేనా ?


ఎన్టీఆర్ - అమిత్ షా భేటీపై ఎడతెగని చర్చ 


జూనియర్ ఎన్టీఆర్ , అమిత్ షాల భేటీ జరిగినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతోంది. ఎందుకు కలిశారన్నదే ఈ చర్చల సారాంశం. రాజకీయం ఉందా లేదా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే  బీజేపీ మాత్రం అలాంటి రాజకీయం ఏదీ లేదని.. కేవలం అభినందించడానికే పిలిచారని అంటున్నారు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం అదే పనిగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకూ స్పందించలేదు. దీంతో ఊహాగానాలు మరింత పెరిగిపోతున్నాయి. 


అప్పుడు తిట్టారు - ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన చేతులు కట్టారు