తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) జార్ఖండ్ వెళ్లి అక్కడ పుల్వామా ( Pulwama Attack ) దాడిలో చనిపోయిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ నుంచి  రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం ( Jharkhand CM ) హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు  అమర జవాన్ల కుటుంబాలకు చేస్తారు. చైనా సైనికులతో  జరిగిన ఘర్షణ లో కల్నల్ సంతోష్ బాబు ( Santosh Babu ) వీర మరణం చెందారు.   గల్వాన్ ఘటనలో చనిపోయిన వారికి కేసీఆర్ 2020 జూన్ 19వ తేదీన కుటుంబానికి  రూ. ఐదు కోట్ల సాయాన్ని కేసీఆర్ ఇచ్చారు.  సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు.. ఆయన భార్యకు.. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇచ్చారు. 


ఆ ఘటనలో మరణించిన మరో 19 మంది సైనికులకు తలా పది లక్షల సాయం ప్రకటించారు.  అయితే కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి ప్రకటించిన అన్ని సౌకర్యాలు ఇచ్చేశారు కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన జవాన్లకు ప్రకటించిన సాయాన్ని ఇంత వరకూ పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా జార్ఖండ్‌తో ప్రారంభిస్తారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు  జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ చర్యలు చేపడతారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే  ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ( Farmar Families )  ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. టికాయత్ ( Rakesh Tikait ) నేతృత్వంలోని రైతు సంఘంతో మాట్లాడి అందరికీ పంపిణీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు.  కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో రాకేష్ టికాయత్ కూడా కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన రైతుల జాబితాను కేసీఆర్ అడిగి ఉంటారని భావిస్తున్నారు. ఇలా  కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయానికి అర్హులైన వారి జాబితాలను ఖరారు చేసుకుని కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి పంపిణీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఓ రకంగా ఇది ఓదార్పు యాత్ర( Odarpu Yatra )  తరహా రాజకీయమని అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఉత్తరాదిలో విస్తృతంగా పర్యటించానుకుంటున్నారు. అలా పర్యటించడానికి ఈ ఓదార్పు యాత్ర తరహా రాజకీయం సరిగ్గా సూటవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆర్థిక సాయం చెక్కులతో  ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అనుకోవచ్చు.