Karnataka politics is taking a turning point : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఆ పార్టీకి కాస్త ధైర్యం ఇచ్చిన రాష్ట్రం కర్ణాటక. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముందుగా రాజును బలహీనం చేస్తున్న బీజేపీ.. తర్వాత సైన్యాధిపతులను టార్గెట్ చేస్తూ వస్తోంది. సిద్ధరామయ్య ముడా స్కాంలో ఇరుక్కున్నారు. ఆ స్థలాలన్నీ వెనక్కి ఇచ్చేసి బయటపడాలని అనుకుంటున్నారు కానీ.. రాజకీయ దుమారం ఆగేలా లేదు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అదే సమయంలో సీఎం మార్పు ఖాయమంటూ సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హనీ ట్రాప్ అంశంపై కూడా తెరపైకి వచ్చింది.
సమస్యల్లో సిద్దరామయ్య - పక్క చూపుల్లో కాంగ్రెస్ నేతలు
సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. అది రోజు రోజుకు పెను వివాదంగామారింది. చివరికి ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయన తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఉండటంతో మరో వైపు బీజేపీ ఆపరేషన్ కమల్ ప్రారంభించిందన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ సారి ఢిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ పెద్దల్ని కలిసినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడానికి రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తూంటే అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగినట్లుగా ఉన్నా.. నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జరుపుతున్న సీక్రెట్ సమావేశాలతో వెల్లడవుతూనే ఉంది.
హుదూద్ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
తాజాగా హనీ ట్రాప్ అంటూ తెరపైకి మహిళ
కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్‌కు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ఈ హనీ ట్రాపే కారణం. సీనియర్ మంత్రి ఒకరు ఇలాంటి ట్రాప్ లో ఇరుక్కుని రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత చాలా సీడీలు ఉన్నాయని ప్రచారం జరిగినా చివరికి ఏవీ బయటకు రాలేదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారిపోయారు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మరో మహిళ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు ముఖ్య నేతలు హనీ ట్రాప్‌లో ఇరుక్కున్నారని బీజేపీ నేతలు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తే వారికి ఇస్తానని చెప్పారు. ఆమె నిజంగా చెప్పిందా లేకపోతే రాజకీయమా అన్నది క్లారిటీ లేదు. కానీ అందులో ఏదైనా మ్యాటర్ ఉంటే మాత్రం రానున్న రోజుల్లో సంచలనం ఖాయమనుకోవచ్చు.
సానియా మీర్జా పెళ్లి మరోసారి పాకిస్థానీతోనే అయిపోయిందా ? అసలు నిజం ఏమిటంటే ?
కాంగ్రెస్‌లో కుమ్ములాటలతో బీజేపీ రాజకీయం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం బీజేపీకి ఇష్టం లేదని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి మార్పు చర్చల్లో కాంగ్రెస్ నేతలు చాలా మంది తమకే సీఎం పదవి అని లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటున్నారు. బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఒకరైనా బీజేపీ వైపు కొంత మంది ఎమ్మెల్యేలతో వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు ఏర్పడతాయి. అదే సమయంలో కర్ణాటకలో ఆపరేషన్ కమల్ నిర్వహించడంలో బీజేపీ చాలా సార్లు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా అలాంటిదే నిర్వహిస్తే ఫెయిలయ్యే అవకాశం లేకుండా చూసుకుంటుంది. అందుకే కర్ణాటకలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి దేశమంతా వ్యక్తమవుతోంది.