KA Paul offer To Pavan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ( PK ) ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడుకేఏ పాల్ ( KA Paul ) బంపర్ ఆఫర్ ఇచ్చారు. జనసేన పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తే ఎంపీనో.. ఎమ్మెల్యేనోచేస్తానని లేకపోతే రూ. వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. కేఏ పాల్ రూ. వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో కానీ.. తమ పార్టీలో చేరితో పవన్ కల్యాణ్‌ను ఎంపీగానో.. ఎమ్మెల్సీగానో గెలిపించడం ఖాయమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ సీటు తప్ప మిగిలిన అన్నీ ఎంపీ సీట్లు ప్రజాశాంతి పార్టీకే వస్తాయని కేఏ పాల్ ధీమాగా చెబుతున్నారు. 


పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దు - ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఫైనల్ వార్నింగ్ !


తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎమ్మెల్యే సీట్లూ గెలిచేసి, ఇక్కడ ముఖ్యమంత్రి పదవుల్ని పంచేస్తానని పాల్ చెబుతున్నారు.   ప్రజాశాంతి పార్టీలో ( Prajasanti Party ) చేరితే పవన్ కళ్యాణ్‌కు ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కూడా చెబుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలని కేఏ పాల్ అంటున్నారు. కేఏ పాల్ మాటలు అతిశయోక్తులతో ఉంటాయి కానీ ఆ విషయాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోరు. తన పద్దతిలో తాను సీరియస్‌గా రాజకీయం చేస్తూ వెళ్తున్నారు. 


"టెన్త్ ఫెయిల్" పాపం ఎవరిది ? మీదంటే మీదని టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రచ్చ !
 
తాను దేశంలో ప్రముఖ వ్యక్తినని  భారత్ దేశంలో మోస్ట్ సెర్చేడ్ మ్యాన్ ( Most Searched Man ) తన పేరు ఉందని అందుకే తనకు ఎదురు లేదని కేఏపాల్ చెబుతూ ఉంటారు. తెలంగాణలో ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు. అమరుడు  శ్రీకాంత చారి తండ్రికి తొలి టిక్కెట్ ప్రకటించారు.  అమరుల కుటుంబాల నుంచి  20 మందిని అసంబ్లీకి ( Assembly ) పంపిస్తామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ తమ పార్టీ నాయకులతో నిండిపోతుందని అందుకే త్వరగా వచ్చి తమ పార్టీలో చేరాలని అందర్నీ కోరుతున్నారు.  


ఎక్క‌డ నెగ్గాలో కాదు, ఎక్క‌డ త‌గ్గాలో కూడా తెలుసు - సీఎం సీటుపై పవన్ కళ్యాణ్ తగ్గేదేలే !



కేఏపాల్ ఎంత సీరియస్‌గా రాజకీయం చేస్తున్నా ఇతరులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ కామెడీగానే చూస్తున్నారు.  ఈ క్రమంలో తనేంటో చూపిస్తానని కేఏ పాల్ అంటున్నారు.