YSRCP MLAs MEET :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులందరితో సమావేశం కావాలని నరి్ణయించుకున్నారు. 19వ తేదీన తాడేపల్లిలో సమావేశం జరగనుంది.  అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతున్న త‌రుణంలో శాస‌న స‌భ్యులు అంతా అందుబాటులో ఉంటార‌ని భావిస్తున్నారు.ఇక నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ల‌కు కూడ స‌మాచారం అందింది. 175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల,  వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త లతో జగన్ సమావేశం అవుతున్నారు. 


గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రతీ నెలా సమీక్షలు చేస్తానని గతంలోనే చెప్పిన జగన్ 


ఇప్పటికే జగన్ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ నెలా సమీక్ష చేస్తానని కూడా చెప్పారు. ఈ అంశంపైనే జగన్ మరోసారి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటికప్పుడు జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎవరెవరు సీరియస్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఎవరు మొక్కుబడిగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు... లాంటి వివరాలతో ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో నియోజకవర్గాల్లో పని తీరు గురించి కూడా జగన్ కొంత మందిపై అసంతృప్తితో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. 


పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై చర్చించే అవకాశం


ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి సోషపల్ మీడియాతో పాటు ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ నేరుగా  వైఎస్ఆర్‌సీపికి ఇప్పుడు పని చేయడం లేదు. ఆయన సంస్థలో పని చేసే మరో కీలక వ్యక్తి రిషి రాజ్ పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీకే టీముల్ని పంపి సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నారు. ఈ నివేదికలు దాదాపుగా అరవై, డెభ్బై మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వారిని ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ ఆదేశిస్తున్నారు. గ్రాఫ్ పెరగకపోతే.. ఎంత సీనియర్లనైనా సరే పక్కన పెడతానని ఇప్పటికే హెచ్చరించారు. 


సోషల్ మీడియాలో వెనుకబడిపోయామన్న భావన - కొత్త టీంతో రంగంలోకి !


సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ వెనుకబడిపోయిందన్న నివేదిక పీకే టీం జగన్‌కు ఇచ్చింది. అందుకే ఇటీవల జగన్ రెండు రోజుల పాటు వరుసగా సోషల్ మీడియా అంశంపై సమీక్ష చేశారు. సీనియర్ నేత విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి.. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి ఆ స్థానం ఇచ్చారు. అలాగే జిల్లాలకు సోషల్ మీడియా కన్వీనర్లు.. కో కన్వీనర్లను నియమించారు. వారితో ఎలా సోషల్ మీడియా ప్రచారం చేయించుకోవాలో జగన్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.,  సమావేశం ఎజెండాను వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఇప్పటికే ఖరారు చేశారు. 


కట్టని, కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని కోసం వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమం - సీఎం జగన్