Only KTR :    తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా ముందు అందరూ మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తున్నారు.  ఆయనకు ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. దానికి తాజాగా ఉాదాహరణ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం. నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేశాయి విపక్షాలు.  ఐటీ మంత్రిని అయినంత మాత్రాన కంప్యూటర్లు మొత్తం తన చేతిలో ఉంటాయా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నారని వంద కోట్ల పరువు నష్టం దావాకు లీగల్ నోటీసులు కూడా పంపారు. అయితే ఒక్క పేపర్ లీకేజీ కేసు మాత్రమే కాదు దాదాపు ప్రతి విషయంలోనూ కేటీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు విపక్ష నేతలు. 


ప్రతీ విషయంలోనూ కేటీఆరే టార్గెట్ !


డ్రగ్స్ కేసులో ఏదైనా జరిగితే ముందుగా కేటీఆర్‌ను విమర్శిస్తారు. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేటీఆరే టార్గెట్ అవుతారు. ధరణి వ్యవస్థ లో వెలుగు చూస్తున్న లోపాలకూ కేటీఆరే కారణమని ఆయన భూదందాలకు పాల్పడ్డారని అంటారు. ఇలా ప్రతీ శాఖలో ఏదైనా లోపం జరిగితే కేటీఆర్‌పైనే ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తారు కానీ ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి జోలికి మాత్రం ప్రతిపక్ష పార్టీలు వెళ్లవు.  ఇదంతా చాలా కాలంగా జరుగుతోంది. నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు కేటీఆర్ కూడా తనకేం సంబంధం ఫలానా శాఖ మంత్రి ఉన్నారు కదా అని అనరు ఆయనే బాధ్యత తీసుకుంటారు ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తారు. ప్రభుత్వం అంతా మంచిగా చేసిందని విపక్షాలే ఆరోపణలు చేస్తున్నాయని చెబుతూ ఉంటారు. దీంతో తప్పు జరిగిదే ఆయనదే బాధ్యత అని విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతోంది.


అన్ని శాఖల బాధ్యతలూ అనధికారికంగా  చూస్తున్నందుకేనా ? 


జనమే  కాదు విపక్షాలు కూడా ఆయనను కేవలం ఆయనకు కేటాయించిన శాఖల మంత్రిగానే చూడటం లేదు. కేటీఆర్ ఇప్పుడు సకల శాఖల మంత్రి అన్ని శాఖలనూ ఆయనే సూపర్ వైజ్ చేస్తూంటారని నమ్ముతుంటూరాు. అందుకే ఎక్కడ ఏం జరిగినా ఆయననే విపక్షాలు గురి పెడుతున్నాయి. పాలనా వ్యవహారాలన్నీ ఇప్పటికే కేటీఆర్ చూస్తున్నారని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా పర్యటిస్తున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ల ఓపెనింగ్ అయినా తానే వెళ్తారు. శంకుస్థాపనలు అయినా తానే వెళ్తారు. విద్యా శాఖ ఒప్పందాలకైనా తానే వెళ్తారు. అబ్కారీ శాఖ కీలక సమీక్షలూ తానే చేస్తారు. అయితే ఆయన ఆయన శాఖలకు మంత్రి కాదు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పరు  ఇదంతా రొటీనే కదా అనుకుంటున్నారు. అందుకే ఆరోపణలు కూడా ఆయన మీదనే వస్తున్నాయి. ఓ రకంగా హరీష్ రావు నిర్వహించే శాఖలు తప్ప మిగతావన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తాయి ఆయన ఆదేశాల ప్రకారమే పని చేస్తాయి. ఆయా శాఖల మంత్రులు ప్రత్యేకంగా సమీక్షలు చేసే సందర్బాలు తక్కువని అటున్నారు. 


కేటీఆర్ కూడా తనకేం సంబంధం లేదనడం లేదు..  బాధ్యత తీసుకుంటున్నారు ! 


 ఇతర శాఖల విషయంలో జోక్యం విషయంలో  తనపై ఆరోపణలు వస్తే కేటీఆర్ తేలిగ్గా తీసుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్ ఫుల్ మినిస్టర్‌గా బాధ్యత తీసుకుంటున్నారు. ఏదో ఓ సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి కేటీఆర్‌కు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది.   కేటీఆర్ కూడా అందుకు మానసికంగా రెడీ అయినట్లుగా   ఆరోపణలకు సమాధానం ఇస్తున్నారు.