Is Congress doing diversionary politics to push back From demolitions : తెలంగాణ రాజకీయాల్లో బుధవారం మధ్యాహ్నం వరకూ హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలపై చర్చే. కానీ కొండా సురేఖ ఎప్పుడు అయితే కేటీఆర్ ను కౌంటర్ చేయడానికి సిన ఫ్యామిలీస్ ను.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను తెరపైకి తెచ్చారో అప్పుడే సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ నేతలంతా కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు. ఆమె  వ్యక్తిగత ఆడియో రికార్డును పోస్టు చేస్తున్నారు. మహిళా నేతలు భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కొండా సురేఖను డిఫెండ్ చేయడానికి కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది. ఇంటే రాజకీయం పూర్తిగా మారిపోయిందన్నమాట. 


కొండా సురేఖ ఆవేశంలో అలా మాట్లాడతారా ? 


మంత్రిగా ఉన్న కొండా సురేఖ అత్యంత సీనియర్ నేత. ఆమెకు రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. ఆమె రాజకీయ విమర్శలు చేశారు కానీ ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. కానీ తొలి సారిగా ఆమె కేటీఆర్ ఇష్యూలో నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకు వచ్చారు. మాములుగా ఆరోపణలు చేస్తే.. పెద్దగా ఎఫెక్ట్ ఉండదేమో కానీ.. ఆమె చెప్పిన విధానం బీఆర్ఎస్ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. చాలా విడమర్చి చెప్పారు. ఆమ చేసిన వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి. అలాంటి గాసిప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే చెప్పుకుంటూ ఉండటంతో ఇక వాటికి తిరుగులేకుండా పోయిది. కానీ కొండా సురేఖ చేసింది కరెక్ట్ కాదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని కోరుకున్న ఎఫెక్ట్ వచ్చేందుకే అలా మాట్లాడారని అంటున్నారు. 


Also Read: Konda Surekha : డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు


కూల్చివేతల టాపిక్ డైవర్ట్ ఖాయం !


ఇప్పటికే బీఆర్ఎస్ మహిళా నేతలు కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొండా సురేఖతో మరో మహిళ మాట్లాడిన ఆడియో టేపును వైరల్ చేస్తున్నారు. కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతలపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇది అంతటితో ఆగిపోదని ముందు ముందు మరికొన్ని  మాటల మంటలు, వీడియోలు, ఆడియోలు లీక్ అవుతాయన్న ప్రచారాన్ని మైండ్ గేమ్ మాదిరిగా రెండు పార్టీల నేతలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడల్లా ఈ టాపిక్ కు అంతం పడే అవకాశం లేదు. అంటే హైడ్రా కూల్చివేతలు.. మూసి నది సుందరీకరణ ఇలా అన్ని వెనక్కి పోతాయన్నమాట. ఈ రాజకీయాలు ప్రజల్లో ఓట్ల పరంగా సృష్టించే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో కానీ.. వివాదం సద్దమణిగిన తర్వాత వేగంగా మర్చిపోతారు ప్రజలు. ఎందుకంటే వారి జీవితాల్లో ఈ రాజకీయ వివాదానికి ప్రాధాన్యత ఉండదు. 


మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన


బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా ?


హైడ్రా, మూసి కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టగలిగామని ప్రజా వ్యతిరేకత పెంచగలిగామని  బీఆర్ఎస్ అనుకుంటోంది. ఇలాంటి సమంయలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ టాపిక్  డైవర్ట్ కాకుండా అసలు అంశాన్ని లైవ్ లో ఉంచుకునేందుకు వ్యూహాత్మక రాజకీయం చేయాల్సి ఉంది. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినిమా తారలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి.. వాటి వ్యాప్తిని అపేసి అసలు సమస్యను హైలెట్ చేయడం కత్తి మీద సాము లాంటిదే.