GVL On Jagan : రిజర్వేషన్ల అంశంపై కాపులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని  అబద్దాలు చెప్పారని, పార్లమెంటు సాక్షి గా కాపుల రిజర్వేషన్ కరెక్ట్ అని తేలిందన్నారు. కాపులకు బీజేపీ అండగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది చెల్లదని జగన్ ప్రభుత్వం  తర్వాత రద్దు చేసింది. పార్లమెంట్ ఇటీవల ఆ నిర్ణయం చెల్లుతుందని రిజర్వేషన్లు ఇవ్వవొచ్చని తెలిపింది. దీన్నేగుర్తు  చేసి.. జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


అధికారంలో లేకపోయే సరికి చంద్రబాబుకు హైదరాబాద్ గుర్తుకు వస్తుందని.. 2024 ఎన్నికల తరువాత జగన్ కూడా హైదరాబాద్ లో కూర్చుంటారని జోస్యం చెప్పారు.   ఐటీ రంగంలో  ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణం గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఏపీకి చెందిన పది శాతంమ మందికిపైగా ఉన్నారని కానీ ఏపీ నుంచి ఐటీ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు వాటా జీరో అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు.ఇక్కడ ఐటీని ఎందుకు ముందుకు తీసుకెళ్ల లేదని ఆయన ప్రశ్నించారు. 


చంద్రబాబు, జగన్‌కు అధికారం కోసం ఏపీ కావాలికానీ..  ప్రతిపక్షంలో ఉంటే మాత్రం హైదరాబాదే కావాలన్నారు.  నేను ఇక్కడే ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా  అమరావతి లోనే ఉంటా అన్నారని ఆ తరువాత అధికారంలోకి వచ్చి  రాజధాని  లేకుండా చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ముందు గతంలొ ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోండని జగన్ కు సూచించారు. హైదరాబాద్ లో మీ సొంత ఆస్తులు,  కేంద్రం సహకారం లేకుండా ఏపికి మీరేమి చేశారో‌ చెప్పాలని  టీడీపీ, వైసీపీలను జీవీఎల్ నిలదీశారు. ఏపీ అభివృద్ధి పై చంద్రబాబు, జగన్ లకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు ఎపికి ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. ఏపీకి  కంపెనీలు తీసుకు రావడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉందని,అయినా కంపెనీలు తీసుకురకపోగా, వచ్చినా ప్రోత్సహించటం లేదని జీవీఎల్  మండిపడ్డారు. 


డిసెంబరు 25 వాజపేయి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు బీజేపి నేతలు రెడీ అవుతున్నారు.  మాకు ఎంపీలు లేకున్నా... మేము రాష్ట్ర క్షేమం కోసం పని చేస్తున్నామని,69 జాతీయ రహదారుల ప్రాజెక్టు లు 1056కిమి మేర పది వేల‌కోట్లతో పనులు చేస్తున్నారని వివరించారు.12,509కోట్ల తో గ్రీన్ ఫీల్డ్ ఎకనామికల్‌ కారిడర్ కడప, విజయవాడ ల్లో నిర్మాణం రెండు ఏళ్లల్లో పూర్తి అవుతుందని,భోగాపురం ఎయిర్ పోర్ట్, రిషికొండ తవ్వకాలు పై కూడా పార్లమెంటు లో ప్రశ్నించిట్లు వివరించారు.కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,బూస్టర్ డోస్ కింద వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని,ప్రజలంతా స్వీయ రక్షణ కోసం వ్యాక్సిన్ వేయించు కోవాలని సూచించారు.కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాలను పూర్తిగా పాటించాలన్నారు.