Guarantees implementation Faild: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఐదు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పి ఇక్కడ కూడా అవే హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. తర్వాత రూ. రెండు లక్షల రుణమాఫీని అమలు చేశారు. దానిపైనా విమర్శలు ఉన్నాయి. ఇక ఎలాంటి గ్యారంటీని అమలు చేయలేదు. సమీప కాలంలో అమలు చేస్తామని కూడా చెప్పలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఎన్నికల్లో గెలిపించిన గ్యారంటీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ' గ్యారంటీలు' హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 025 అక్టోబర్ నాటికి, ఈ హామీల్లో కీలకమైనవి అమలు కావడం లేదు. బడ్జెట్ 2025-26లో రూ.56,084 కోట్లు ఈ గ్యారంటీలకు కేటాయించినప్పటికీ, పూర్తి అమలు లేకపోవడంపై BRS, BJPలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో 'అభయ హస్తం'లో ప్రకటించిన గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం ఉన్నాయి. అమలు చేస్తున్న పథకాలు ఇవీ !
ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ లబ్దిదారులు ఎంత మంది ఉన్నారో ఇప్పటి వరకూ ప్రకటించలేదు. రూ. 2 లక్షల రుణమాఫీకి రూ.20,617 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సహాయం చాలా కొద్ది మందికి ఇచ్చారు.
అమలు కాని హామీల సంగతేంటి
మహాలక్షి పథకం కింద మహిళలకు రూ.2,500 నెలవారీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పథకం అమలు గురించి ఆలోచిండం లేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు (రూ.5 లక్షలు), ఉద్యోగ శిక్షణకు రూ.4,000 స్టైపెండ్ అమలు కాలేదు చేయూత పథకం కింద సామాజిక పెన్షన్లు పేదలకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, మహిళలు, యువత వంటి విభాగాల్లో చాలా హామీలు మేనిఫెస్టోలో 'బంగారు తెలంగాణ'కు సంబంధించి, ముఖ్యంగా మహిళలు, పెళ్లి, బంగారం సహాయం వంటి 'బంగారుతల్లి ' వంటి స్కీమ్‌లు ఉన్నాయి. పేద కుటుంబాల్లో కలిగిన బాలికలకు పెళ్లికి 10g బంగారం + రూ.1 లక్ష సహాయం ఇస్తామన్నారు. అంబేద్కర్ అభయ హస్తం కింద SC/ST కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు. రెండేళ్లుఅవుతున్నా.. ఇప్పటికీ అమలు చేయడం లేదు. గ్యారంటీలతో పాటు ఇంకా చాలా హామీలు ఇచ్చారు. కళ్యాణమస్తు కింద .. తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.కానీ ఇవ్వడం లేదు. పేదలకు ఎదురు చూసే పథకాలు చాలా ఉన్నాయి !
పేదలు ఎదురు చూసే అత్యంత ముఖ్యమైన పథకం.. పెన్షన్లు. ఏపీలో పెన్షన్లు పెంచడంతో తమకూ పెంచుతారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఇస్తామన్న రెండున్నర వేలు.. అలాగే ఆటోడ్రైవర్లకు సాయం వంటివి నేరుగా పేదలకు లింక్ అయి ఉన్నాయి. ఇతర పథకాల విషయంలో ఏమో కానీ వీటి అమలు కోసం.. వారు ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల పాలన విజయవంతం అయిందని సంబరాలు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కానీ ఇలాంటి కీలక పథకాల అమలు విషయం ఈ సంబరాల్లో కచ్చితంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.