కృష్ణాజిల్లా గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ వైసీపీ పంచన చేరటంతో రాజకీయంగా మరింత జోరు అందుకుంది. నియోజకవర్గంలో వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరారావు, యార్లగడ్డ వెంకటరావు, శివ భరత్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతుంది. నేతలు ఒకరిపై ఒకరు మాటలతోనే కౌంటర్ ఎటాక్ లు ఇస్తూ అధికార పక్షంలో రాజకీయం రసవత్తరంగా మార్చేశారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ వల్లభనేని వంశీ ఇటీవల సొంత పార్టీ నాయకులకే కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత తామేమి తక్కువ కాదు.. అన్నట్లుగా దుట్టా రామచంద్రరావు , యార్లగడ్డ వెంకటరావు, శివభరత్ రెడ్డి లు ఎమ్మెల్యే వంశీ కి కౌంటర్ ఇచ్చారు.
దీంతో నేతల మధ్య రోజుకో కామెంట్ తో నియోజకవర్గంలో అధికార పార్టీలోనే విభేదాలు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. టీడీపీ నుండి రెబల్ ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో కొనసాగుతున్న వంశీని ఎదుర్కొనేందుకు నాయకులంతా ఏకం అయ్యారని చెబుతున్నారు. ఎవరికి వారు తగ్గేదే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వైసీపీ నేతల్లో హె టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఈ వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే సీఎం జగన్ తనను నియోజకవర్గంలో పని చేసుకొమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వంశీ నియోజకవర్గంలోని వైసీపీ నేతలకు చెబుతున్నారు.
అయితే పార్టిని నమ్ముకొని మెదటి నుండి పని చేస్తున్న తమను కాదని,ఇప్పుడు పక్క పార్టీలో గెలిచి వచ్చిన వారికి నియోజకవర్గం బాధ్యతలను అప్పగించటంపై వైసీపీ నేతలు భగ్గుంటున్నారు. వంశీకి వ్యతిరేకంగా దుట్టా, యార్లగడ్డ , శివభరత్ రెడ్డి వర్గాలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరు కుక్కలో అందరికీ తెలుసంటూ పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు తీవ్ర స్దాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.
40 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నానని, ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా అని స్వయంగా జగన్ అడిగారని చెప్పారు. కేవలం 800 ఓట్లతో గెలిచిన వంశీ తమపై ఆరోపణలు చేయటం ఎంటని అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. అటు దుట్టా అల్లుడు గోసుల శివభరత్ రెడ్డి కూడ ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ని చూసి ఊరుకుంటున్నామని, రాయలసీమలో పాలేరుగా పని చేసిన వంశీ ఇప్పుడు తమను విమర్శించటం ఎంటని ద్వజమెత్తుతున్నారు.
తాము మనుషులకు వైద్యం చేసే వాళ్లం కాబట్టి మనుషులుగా ప్రవర్తిస్తున్నామని, వంశీ పశువులకు వైద్యం చేస్తాడు కాబట్టి అలానే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిచ్చి పడితే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని ఎద్దేవా చేశారు.
అయితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఇదే స్దాయిలో రియాక్ట్ అయ్యారు. దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించానని, హద్దు మీరి పరిధి దాటి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. శివ భరత్ రెడ్డి డొక్క పగలకొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. వయస్సుకి మించి ఎక్కువ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ భరత్ రెడ్డి భార్యకి జడ్పీటీసీ బీ ఫాం ఇచ్చింది తానేనని ఏకగ్రీవం చేయించింది కూడా తానేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వంశీ వ్యాఖ్యానించారు.