Exit Poll Results 2024 LIVE: లోక్‌సభ ఎన్నికలపై ABP C-Voter ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్

Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: దేశ వ్యాప్తంగా 7 దశలలో లోక్‌సభ ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. జూన్ 1న సాయంత్రం ప్రముఖ మీడియా ABP CVoter Exit Poll విడుదల చేయనుంది.

Shankar Dukanam Last Updated: 01 Jun 2024 07:39 PM
'దైనిక్ భాస్కర్' సర్వే - దేశంలో ఏ పార్టీది అధికారమంటే?

'దైనిక్ భాస్కర్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 281-350, I.N.D.I.Aకు 145-201, ఇతరులు 33-49 స్థానాలు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది.

లోక్ సభ ఎన్నికలు - ABP C-Voter ఎగ్జిట్ పోల్స్

ABP C-Voter ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీయే కూటమికి 339 - 396 సీట్లు వస్తాయని తేలింది. I.N.D.I.Aకు 122 -167 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 

లోక్ సభ ఎన్నికలు - న్యూస్ నేషన్ సర్వే

న్యూస్ నేషన్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 342-378, I.N.D.I.Aకు 153-169, ఇతరులు 21-23 స్థానాలు వస్తాయని అంచనా వేశారు.

జన్ కీ బాత్ సర్వే - దేశంలో ఆ పార్టీదే అధికారం

'జన్ కీ బాత్' ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీయేకు 362-392, I.N.D.I.Aకు 141-161, ఇతరులు 10-20 స్థానాలు కైవసం చేసుకోనుందని తేల్చింది.

రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సర్వే

ఎన్డీయేకు 353 - 368, I.N.D.I.Aకు 118 - 133, ఇతరులు 43 - 48 స్థానాలు కైవసం చేసుకుంటుందని రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సర్వే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

'ఇండియా న్యూస్ - డీడైనమిక్స్ సర్వే'

'ఇండియా న్యూస్ - డీడైనమిక్స్ సర్వే' ప్రకారం ఎన్డీయేకి - 371, I.N.D.I.Aకు - 125, ఇతరులు - 47 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు అంచనా వేసింది.

ABP C-Voter ఎగ్జిట్ పోల్స్ - ఎన్డీయే కూటమిదే అధికారం

ABP C-Voter ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీయేకి 339 - 396 సీట్లు వస్తాయని తేలింది.

Loksabha Exit Poll Results 2024 LIVE: ఏపీలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ, వైసీపీకి షాకిచ్చేలా ఫలితాలు1

ఏపీలో ఎన్డీఏ కూటమికి 52.9 శాతం ఓట్లు పోల్ అవుతాయని, వైఎస్సార్ సీపీ 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు, ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధిస్తారని ఎగ్జిట్ పోల్ లో తేలింది. ఎన్డీఏ కూటమికి 21 నుంచి 25 సీట్లు, వైఎస్సార్ సీపీకి 0-4 సీట్లు గెలిచే అవకాశం ఉంది.



























రాష్ట్రం



I.N.D.I.A



NDA



YSRCP



ఇతరులు



ఆంధ్రప్రదేశ్



3.3 శాతం



52.9 శాతం



41.7 శాతం



2.1 శాతం


 

-



21-25 సీట్లు



0-4 సీట్లు


 
రిపబ్లిక్ టీవీ సర్వే - ఎన్డీయేకు ఎన్ని సీట్లంటే?

 దేశవ్యాప్తంగా ఎన్డీయేకి 359 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ - PMARQ సర్వే అంచనా వేసింది. అటు, I.N.D.I.Aకు 154 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇతరులకు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Telangana Exit Poll Results 2024 LIVE: తెలంగాణ ఎన్నికల్లో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ - బీఆర్ఎస్ గల్లంతు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 సీట్లు, బీజేపీకి సైతం 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కు 7 నుంచి 9 సీట్లు, బీజేపీకి సైతం 7 నుంచి 9 సీట్లు రాగా, ఇతరులు 1 సీటు నెగ్గుతారని ఎగ్జిట్ పోల్ అంచనాలు ఉన్నాయి.


 



























రాష్ట్రం



I.N.D.I.A



NDA



TRS



ఎంఐఎం



తెలంగాణ



38.6



33.0 శాతం



20.3 శాతం



2.0 శాతం


 

7-9 సీట్లు



7-9 సీట్లు



-



ఇతరులు 1


2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన ఎగ్జిట్ పోల్స్‌

2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్ పలు సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఖచ్చితంగా అంచనా వేశాయి. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పాయి. అయితే 2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించగా...అందరి అంచనాలు తప్పని రుజువు చేస్తూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 

Exit Poll Results 2024 LIVE: 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజమైన అంచనాలు

2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు నిజమయ్యాయి. అలాగే 2019 ఎన్నికల్లోనూ ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు దాదాపు దగ్గరగా అంచనా వేశారు.

1998 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, ఫలితాలు

1998 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కూటమి గెలుపు ఖాయమని చెప్పడంతోపాటు సర్వే సంస్థలు వెల్లడించిన సంఖ్యకు దగ్గరగానే సీట్లు వచ్చాయి.

Exit Poll Results 2024 LIVE: ఎగ్జిట్ పోల్స్‌పై పెరుగుతున్న ఉత్కంఠ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారంతో ముగియనున్న నేపథ్యంలో అదేరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలకు ఈసీ అంగీకరించింది. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో తిరిగి సేకరించిన వివరాలను విడుదల చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 

Exit Poll Results 2024 LIVE: ఎగ్జిట్ పోల్ డిబేట్ లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం

2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. అంతకుముందు దేశవ్యాప్తంగా ఆరు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఏడవ  దశ ఓటింగ్ తర్వాత శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి టీవీ ఛానళ్లలో చర్చలో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.

Exit Poll Results 2024 LIVE: ఎగ్జిట్ పోల్స్ పై అప్పటివరకూ నిషేధం విధించిన ఈసీ

Loksabha Exit Poll Results 2024 LIVE: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. ఏప్రిల్ 19న ఉదయం 7 గంటలకు మొదలైన ఈసీ నిషేధం.. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ముగియనుంది. శనివారం సాయంత్రం (జూన్ 1న) చివరి విడత పోలింగ్ ముగిసిన అరగంటకు అంటే సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. 






 

Background

Exit Polls On June 1 :   రాజకీయ పార్టీలన్నీ ఫలితాల కోసం రెడీ అయిపోయాయి. చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన నిర్వహించారు. పోలింగ్ గడువు ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అవకాశం ఉంది. అన్ని ప్రముఖ సంస్థలు అప్పుడే తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. ఇందు కోసం రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లు సైతం ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆసక్తి 
ఎన్నికల ఫలితాలను ముందుగా అంచనా వేయాలని, తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు సాధారణంగానే ఉంటుంది. అందుకే పోల్ స్ట్రాటజీల కోసం ఇప్పుడు ప్రత్యేక కంపెనీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. వారు సర్వేలు చేసి.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం రానుంది, కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూదు. ఈసీ కోడ్ ప్రకారం చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రకటించాలి. అందుకే జూన్ ఒకటో తేదీన సాయంత్రం 6.30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తారు. 


సాధారణంగా  పోలింగ్  ముందు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ , మూడ్ ఆఫ్ ది నేషన్ వంటి పేర్లతో తమ అంచనాలను పోల్ స్ట్రాటజీ సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తాయి. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సరళని విశ్లేషించి.. ఓట్లేసిన వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు. ఇందులో రిజల్ట్స్ సరళి కనిపిస్తుంది.                    


ఎగ్జిట్ పోల్స్ ను చాలా సంస్థలు ప్రకటిస్తాయి కానీ.. వాటిలో అత్యంత విశ్వసమైనవి సీట్లను దాదాపుగా అంచనా వేస్తాయి. చాలా సంస్థలు ఫీల్డ్ వర్క్ చేయకుండానే అంచనాలను ప్రకటిస్తూ తప్పుదోవ పట్టించేలా ఫలితాలు వెల్లడిస్తాయి. కానీ విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసి ప్రజానాడిని పట్టుకునే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో సీఓటర్ సంస్థ ఒకటి. ఏబీపీ గ్రూప్ తో కలిసి సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ (ABP CVoter Exit Polls 2024) ను ప్రకటించనుంది. చివరి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటన ఉంటుంది.                


ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ కు దేశవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. క్రమం తప్పకుండా ప్రకటించే ఫలితాల్లో చాలా వరకు ఓటర్ నాడిని అంచనావేసిటన్లు ఫలితాలు ఇస్తుంది ఏబీపీ - సీఓటర్. అందుకే ఎగ్జిట్ పోల్స్ పై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తే.. ఫలితాలు కూడా దాదాపు అలాగే వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలకు ఎంతో సమయం ఉండదు. ఈ రెండు రోజుల పాటు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి తుది ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.