YSRCP MLC Seats : ఆంధ్రప్రదేశ్‌లో ఒకే సారి 16 ఎమ్మెల్లీ స్థానాలకు సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఐదుగుర్ని ప్రకటించారు. మరో ఎనిమిది స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. మరో మూడు త్వరలో ఖాళీ కానున్నాయి. వాటన్నింటికీ ఒకే సారి అభ్యర్థుల్ని సీఎం  జగన్ ఖరారు చేయబోతున్నారు. విధేయత, సీనియార్టితో పాటు టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్లకీ అవకాశాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. 


స్థానిక సంస్థల కోటాకు పోటాపోటీ ! 


వైఎస్ఆర్‌సీపీలో స్థానిక సంస్థల కోటా నుంచి టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.  చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకా కుళం జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నా యి. ప్రస్తుతం ఆ స్థానాల్లో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారికి మార్చి 29తో ముగ్గు రికి, మే నెలలో మరో ఐదు మందికి పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణ యం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరిగే 8 స్థానిక సంస్థల స్థానాలన్ని అధికార వైసీపీకే దక్కనున్నాయి. 


సామాజిక సమీకరణాల వారీగా కసరత్తు !


టిక్కెట్లు ఆశించే వారంతా తాడేపల్లిలో మకాం వేసి ముమ్మ ర ప్రయత్నాలు చేస్తున్నారు. తే సామా జిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతను కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారు. ఆ దిశగానే జాబితాను కసరత్తు చేస్తున్నట్లో తెలుస్తోంది.   తుది జాబితా సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ఒక స్థానం మైనారిటీకి, మరో స్థానం బీసీలకు ఇవ్వనున్నారు.  అనంతపురం జిల్లా నుంచి ఏపీ అగ్రి చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌,  కడప జిల్లా నుంచి మాజీ మంత్రి, సీనియర్‌ నేత పి. రామసుబ్బారెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది.నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆర్యవైశ్యులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.  గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు, కమ్మ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మహిళకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా  నుంచి జయమంగళ వెంకటరమణ  పేరును జగన్ ఖరారు చేశారు.  
   
మంత్రివర్గంలో చోటు లేని వర్గాలకు స్థానాలిచ్చే అవకాశం ! 


మంత్రివర్గంలో కొన్ని ప్రధాన వర్గాలకు స్థానం కల్పించలేకపోయారు. ఆ వర్గాలకు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వనున్నారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. అలాగే గుంటూరులో చిలుకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని గతంలో ప్రజల ముందే జగన్ హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటివి మరికొన్ని హామీలు పొందిన వారు ఆశగా పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 


సీఎం  జగన్ ఇప్పటికే ఎమ్మెల్సీ కసరత్తు పూర్తి చేశారు. అదృష్టవంతులెవరన్నది  సోమవారం వెల్లడయ్యే అవకాశం ఉంది.