CM Jagan Comments : తమది  నలుగురు ధనికుల కోసం, రెండు పత్రికలు, మూడు ఛానెళ్లు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడి కోసం నడిచిన ప్రభుత్వం కాదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో వాహన మిత్ర పథకం డబ్బులను డ్రైవర్ల అకౌంట్లలో జమ చేసేందుకు మీట నొక్కిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తమది ఒకటిన్రన కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వమన్నది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. 






ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికే జంట జలాశయాలను ఖాళీ చేస్తున్నారా ? మాజీ ఎంపీ ఎవరిని టార్గెట్ చేశారు ?


అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని ప్రజలను సీఎం కోరారు.‘‘గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా తక్కువేనని సీఎం జగన్‌ అన్నారు.  పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం మనది. గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో ఉండేది. మన ప్రభుత్వంలో దోచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 


అటు పోలవరం - ఇటు కాళేశ్వరం మునక ! తప్పెవరిది ?


రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి.  అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయం మించినవారు లేరు. నాకు ఉన్నది నిబద్ధత, నిజాయితీ, మీతోడు, దేవుడి ఆశీస్సులు’’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 


కలసి కట్టుగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక ప్రదర్శనలు - విపక్ష నేతలతో కేసీఆర్ మంతనాలు !


మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ  సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అర్హత ఉండి పథకం అందకపోతే దరఖాస్తు పెట్టుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరీకి పథకం అందిస్తామని సీఎం అన్నారు.