Babu Balakrishna AHA : నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్ అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు 1995 నాటి ఆగస్టు సంక్షోభం తెరవనుక పరిస్థితులపై తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ అదంరూ తననే నిందిస్తున్నా.. ఆ సంక్షోభ సమయంలో తనవైపు ఉండి.. చివరికి పార్టీలు మారి తననే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకూ చంద్రబాబు స్పందించలేదు. కానీ తొలి సారి ఆ అంశంపై బాలకృష్ణ షోలో స్పందించారు. తన  జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ అని అప్పుడేం జరిగిందో వివరించారు. 


ఇతర వ్యక్తి ప్రభావంలో ఎన్టీఆర్ !


1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ పూర్తిగా బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభావంలో ఉండిపోయారన్నారు. అయితే ఆ వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయని.. ఈ అంశంపై మాట్లాడేందుకు బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లామన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నామన్నారు. అయినా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం కలిసి చర్చించిన తర్వాతనే పార్టీని కాపాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 


ఆ నిర్ణయం తప్పు కాదన్న బాలకృష్ణ !


చంద్రబాబు బిగ్ డెసిషన్ గురించి చెప్పిన తర్వాత... బాలకృష్ణను ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని ప్రశ్నించారు. దీనికి బాలకృష్ణ కూడా స్పందించారు. ఆ రోజున ఎన్టీఆర్‌తో కలిసి మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో తానూ ఉన్నానన్నారు. పార్టీ సభ్యుడిగా, ఒక నందమూరి కుటుంబసభ్యుడిగా, ఒక పౌరుడిలా చెప్తున్నానని ఆ రోజున అలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదన్నారు. రామాంజనేయ యుద్ధంలో రాముడు మీద ఆంజనేయుడిలా   ఆయన కోసం, ఆయన ఆశయాల కోసం ఆ సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


బావోద్వేగంతో బిగ్ డెసిషన్‌పై అభిప్రాయాలు!


1995 ఘటనల అంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అటు చంద్రబాబు.. బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఇరువురి కళ్లలో నీళ్లు వచ్చాయి. జీరబోయిన గొంతుతోనే ఆ చర్చ జరిగింది. నిజాానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పాటు నందమూరి కుటుంబం మొత్తం కూడా... చంద్రబాబు వైపే నిలిచారు. అయినప్పటికీ చంద్రబాబునే ప్రధానంగా నిందిస్తూ ఇప్పటికీ రాజకీయ విమర్శలు చేస్తూంటారు. ఈ ఎపిసోడ్‌తో వాటికి చెక్ పెట్టినట్లయిందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


వైఎస్ పేరు తీసేయడం ఐదునిమిషాల పని !


అదే సమయంలో ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు.  ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి పేరు తీసేసిన అంశంపై  చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. తానను ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు నాకు కడప జిల్లాకు వైఎస్సార్ పేరు మార్చాలంటే  ఐదు నిముషాల  పని.... కానీ నేను అలా చెయ్యలేదన్నారు.  


ఆహా షో ప్రోమో సూపర్ క్లిక్ అవడంతో ... ఓటీటీలో  మధ్యాహ్నం వీడియో అప్ లోడ్ చేయగానే.. లక్షల్లో  ఆహా సబ్ స్క్రయిబర్లు షోను చూశారు. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినట్లుగా తెలుస్తోంది.