Mahanadu Chandrababu :  సీఎం జగన్‌ను ఎప్పుడు ఇంటికి పంపింద్దామా అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని అందుకే  " క్విట్ జగన్... సేవ్ ఆంధ్రప్రదేశ్‌ "  నినాదాన్ని ఇచ్చామని చంద్రబాబు మహానాడులో ప్రకటించారు. మహానాడు సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. చాలా మహానాడులు చూశాను కానీ ఇంత  ఉత్సాహంగా వచ్చిన వారిని ఇప్పటి వరకు చూడలేదని.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉరకలేస్తూ వచ్చారని అభినందించారు.జనాలను రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. డబ్బులు కడతామన్నా బస్సులు ఇవ్వలేదన్నారు. బస్సులు ఇవ్వలేదని.. ఓ పోలీస్ కార్లకు గాలి తీస్తున్నారని.. మీ గాలి తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు.  14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు తాను ఏం చెప్పానో గుర్తు తెచ్చుకోవాలన్నారు. 


 పోలీసులను కూడా గాడిలో పెట్టే దమ్ము మా పసుపు సైన్యానికి ఉందని.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక... తెలుగు వారి పౌరుషానికి ప్రతీక. అలాంటి మహా నాయకుడికి వారసులమని చందర్బాబు ప్రకటించారు.  వాళ్ల మీటింగ్‌లు వెల వెల పోతున్నాయని..... మన మీటింగ్‌లు కళకళలాడుతున్నాయన్నారు.  వచ్చే ఏడాదికి ఎన్టీఆర్ శత జయంతి జరుగుతుందని.... దీని కోసం ప్రత్యేక కమిటీ వేసి ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జిల్లాల్లో కమిటీలు వేసి అన్ని జిల్లాల్లో మహానాడులు పెడతామని వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.బాలకృష్ణ అఖండ సినిమా ఆడకూడదని ప్రయత్నాలు చేశారు. ప్రజలపై నమ్మకం ఉందని బాలకృష్ణ సినిమా రిలీజ్ చేశారన్నారు. చేతకాని దద్దమ్మ సీఎంగా ఉండి సినిమా పరిశ్రమను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు.  గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ అంటే ప్రజలు రారని భయపడి.. ప్రభుత్వం మార్చి వెళ్తున్నారని.. కానీ ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారన్నారు. అది చూసిన తర్వాత బస్సు యాత్ర పెట్టారని... అన్నీ ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయన్నారు. భయపెట్టి రాజకీయం చేయాలని.. జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిత్యవసర వస్తువులు ఇప్పుడు కొనే పరిస్థితి లేదని.. రేపో ఎల్లుండో శ్రీలంక మాదిరిగా ఏపీ మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ప్రశ్నిస్తూంటే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని.. ఇలాంటి వాటికి భయపడే ప్రశ్నే లేదన్నారు.  రౌడీలను అదుపులో పెట్టిన పార్టీ టీడీపీ. ఇప్పుడ రాజకీయా రౌడీలు, రాజకీయ నేరస్తులు వచ్చారు. వాళ్లను అదుపు చేయాలా వద్దా.. వాళ్లను వదిలేయాలా... దోపిడీ దొంగలను వదిలేయాలా  అని సభికులను ప్రశ్నించారు. 


మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని  నిరుద్యోభృతి, అన్న క్యాంటీన్లు, స్కాలర్‌షిప్‌లు ఇవేమీ ఇప్పుడు లేవన్నారు. తెలివైన పిల్లలు ఉంటే అంతర్జాతీయ యూనివర్శిటీలకు పంపించామని గుర్తు చేశారు. ఆదాయంలో 53 శాతం సంక్షేమానిక ఖర్చు పెట్టేవాళ్లం. ఇప్పుడు దాన్ని 41 శాతానికి తగ్గించారన్నారు. ఈ సీఎం వచ్చి 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇది ఎవరు కట్టాలి. జగన్ కడతారా.. మనమే కట్టాలి. మనం తిండిపై, సంపాదనపై బాదుడే బాదుడుతో కట్టిస్తారు. ఆ అప్పు ఎందుకు పెరిగిం.ది.. ఎక్కడికి వెళ్తోంది. ఇది జగన్ మోహన్ రెడ్డి జేబులోకి వెళ్లిందమని మొత్తం కక్కిస్తామన్నారు 


ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని చెప్పి ఇప్పుడు తప్పుడు బ్రాండ్‌లు సొంత బ్రాండ్‌లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో క్వార్టర్ మీద జగన్‌కు రూ.  12 ఆదాయం వస్తోందన్నారు. సంవత్సరానికి లిక్కర్‌లో  జగన్ ఆదాయం ఐదు వేల కోట్లన్నారు. ఇసుక  ఒక్క ట్రాక్టర్ ఆరు వందలకు ఇస్తే విమర్శిస్తేఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు నుంచి ఆరువేలకు అమ్ముతున్నారని గుర్తు చేశారు. ప్రతీ చోటా దోపిడీ జరుగుతోందని.. అన్నింటికీ ఆధారాలు ఉంటాయని.. తాము వచ్చిన వెంటనే.. ఎవరెంత దోపిడీ చేశారో కక్కి్సతామన్నారు. కబ్జా చేసిన భూములన్నింటినీ తిరిగి ప్రజలకు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.   ఏపీలో ఏ శాఖ కూడా పని చేయడం లేదన్నారు. ఆస్పత్రుల్లో మందులు కూడా ఉండటం లేదన్నారు.  బాధపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని... ఆత్మహత్యలు పరిష్కారం కాదు... వైఎస్‌ఆర్‌ పార్టీకి ఉరేసి బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. 
 
యువత సమస్యల్నీ సోషల్ మీడియాలో పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. . ఏమైనా కేసులు పెడితే నేను మీకు అండగా ఉంటాను. అవసరమైతే ఉద్యమం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. తాను ఐటీ ఉద్యోగం, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం, కియా లాంటి పరిశ్రమల్లో ఉద్యోగులు తీసుకు వస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చారన్నారు. ప్రపంచమంతా తిరిగి 16 లక్షల కోట్లు తీసుకొస్తే పాత ఒప్పందాలే జగన్ మళ్లీ దావోస్ లో చేసుకున్నారన్నారు.  అమ్మఒడి అందరికీ ఇవ్వడం లేదని..ఉద్యోగలనూ మోసం చేశారన్నారు.


మీడియాను కూడా అణగదొక్కేస్తున్నారని..మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు కూడ ాఇవ్వలేదన్నారు. కరోనాతో చనిపోతే కూడా సాయం చేయలేదన్నారు. తాను అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామ ీఇచ్చారు. 3 లక్షల ఇళ్లు కట్టిస్తామని.. మూడు ఇళ్లు కట్టారు. వ్యాపారులు కూడా నష్టపోయారన్నారు. దళితులపై దాడులు చేశారని..  దళిత యువకుడ్ని చంపి ఓ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారన్నారు. టీడీపీ పోరాడితేనే అరెస్ట్ చేశారన్నారు. ఇంకా బాబాయ్ హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిని మాత్రం కాపాడుతున్నారని మండిపడ్డారు. 


అమరావతిని ఆపేయడం వల్ల 2  నుంచి 3 లక్షల కోట్లు రాష్ట్రం నష్టపోయిందన్నారు.  పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు. 72 శాతం పూర్తి చేసి ఇస్తే ఇప్పటి వరకు ముందుకు కదల్లేదు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టులు మొత్తం రివర్స్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.  తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే వెలిగొండతోపాటు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం చివరి ఆయకట్టు భూములకు నీళ్లు ఇచ్చే బాద్యత తెలుగుదేశానిదన్నారు. రోడ్లు ఉంటాయని కూడా జగన్ మర్చిపోయారన్నారు. నాడు కరెంట్ కోతలులేకుండా చేస్తే ఇప్పుడు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని గుర్తు చేశారు. అప్పులకు ఆశపడి మీటర్లు పెడుతున్నారని.. మీటర్లు పెట్టకుండా పోరాడితే తాను అండగా ఉంటానన్నారు.  ఓటీఎస్‌ విషయంలో ఇదే చెప్పామని ఎవరూ కట్టొద్దని చెబితే ఎవరూ కట్టలేదన్నారు.  అదే మాదిరిగా రైతులు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.  


ప్రత్యేక హోదా  గురించి తాము పోరాడామని.. కానీ మెడలు వంచుతామన్న జగన్.. ఇప్పుడు మెడలు వంచుకుంటున్నారని విమర్శించారు.  ప్రజల ఆదాయం పెరగలేదు కానీ జగన్ ఆదాయం.. ఆయన బినామీల ఆదాయం విపరీతంగా పెరిగిందన్నారు.  రాష్ట్రాన్ని సజ్జల, విజయసాయి, వేమిరెడ్డి పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ  అరాచక పాలనపై యుద్ధం ప్రకటించామని ఎవరూ వదిలి పెట్టొద్దని చంద్రబాబు పిలునిచ్చారు. మీ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదేనని పిలుపునిచ్చారు.