TRS vs BRS: టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ మొదలు పెట్టింది. రెండు బ్రాండ్‌లకు సంబంధించిన నకిలీ ప్రొడక్ట్స్‌ను పోస్టు చేసి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కామెంట్ చేసింది. 

Continues below advertisement

Naaptol పార్టీస్ అంటు కాసేపటికే మరో ట్వీట్ వేసింది బీఆర్‌ఎస్. ఇందులో షర్మిలను కూడా యాడ్ చేశారు. కవిత, షర్మిల ఫొటోలను పెట్టి ట్రోల్ చేశారు. ఆమె వైఎస్‌ఆర్‌సీపీని మార్చి వైఎస్‌ఆర్‌టీపీగా పార్టీ ప్రారంభించారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ రాష్ట్ర సేనగా మార్చి కవిత పార్టీ పెట్టారని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 

బీఆర్‌ఎస్  చేసిన పోస్టు పెట్టిన వెంటనే కవితపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు చేసినట్టుగానే తీవ్ర స్థాయిలో కవితపై నెగిటివ్‌ కామెంట్స్ పెడుతున్నారు. షర్మిల, కవిత ఫొటోలను పక్క పక్కనే పెట్టి ట్రోల్ చేస్తున్నారు. జయలలిత గెటప్‌ కాపీ, షర్మిలా చీర కాపీ, టీఆర్‌ఎస్ పేరు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు. 

కవిత చేసిన మరమనిషి కామెంట్స్‌పై కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరమనిషి అయినప్పుడు ఆయన ఇంటి పేరు ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదని తెలంగాణ రేవంత్ సమితి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు రౌడీ సినిమాలో మోహన్ బాబు సింహం డైలాగ్‌, శత్రవులు ఎక్కడో ఉండర్రా అని రావు రమేష్ చెప్పిన డైలాగ్స్‌ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

కవిత టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల నుంచి ఇతర ప్రత్యర్థుల నుంచి బీఆర్‌ఎస్‌కు గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఒరిజినల్‌గా రాష్ట్రం కోసం పని చేసే కేసీఆర్ లాంటి వ్యక్తిని డమ్మి చేశారని ఎద్దేవా చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టీఆర్‌ఎస్ ఫేక్ అని ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు ఏం ఉద్దరించామని దేశ సేవలు బయల్దేరి పేరు మార్చారని నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్ ఫొటోలు పెట్టి ఒరిజినల్, ఫేక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎలా ఉన్నా సరే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందో చెప్పాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు అనుకుంటే ఏదైనా చేస్తారని ఇంకో నెటిజన్ కామెంట్స్ చేశాడు.