AP BJP :  తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు ..  పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారని బండి సంజయ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఎన్‌ఐఏ సోదాలు ఏపీలోనూ జరుగుతున్నాయి. ఈ క్మమంలో ఏపీలోనూ అధికార పార్టీ నేతలు  పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారని .. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపమలు చేశారు.  అధికార పార్టీ ఉప ముఖ్యమంత్రి కోందరు నేతలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ వారిvf వైసీపీ మిత్రపక్షాలుగా చూస్తోందని విష్ణువర్ద్ రెడ్డి ఆరోపించారు. 


ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు : విష్ణు


పీఎఫ్ఐ, ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై జాతీయ భద్రతా సంస్థలు నిఘా పెడుతున్నాయి. ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని విష్ణు విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థలకు షెల్టర్ జోన్లుగా తయారయ్యాయన్నారు.  డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,హఫీజ్ ఖాన్ వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషను తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెట్టారని గుర్తు చేారు. 


జైలు నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీల వారితో వైఎస్ఆర్‌సీపీ ర్యాలీలు


గుంటూరు, రాయచోటి , ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను తగుల పెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని.. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..? అని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.  పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులపై ఉన్న కేసులను ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందా అని ప్రశ్నించారు గతంలో పోలీస్ స్టేషన్‌పై దాడులు చేసిన వారి కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ అంశాన్ని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేా జైళ్ల నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో కలిసి ర్యాలీలు చేశారని .. ఉగ్రవాద సంస్థలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో గతంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత చర్చలు జరుపారన ిగుర్తు చేశారు. 


జిన్నాటవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలి 


 తనను పొగిడించుకోవడానికి లేదా కొత్త సమస్యలు సృష్టించడానికి జగన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. పేర్లు మార్చి.. స్టిక్కర్లు మార్చి లాభం పొందాలని వైసీపీ భావిస్తోందన్నారు.  వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు మార్చడం కాదు.. ప్రధాని లాగాప్రజల హృదయాలను గెలవాలని సూచించారు.  పేర్లు మార్చాలనుకుంటే గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చండి.పాకిస్తాన్ మూలాలున్న జిన్నా పేరుతో గుంటూరులో టవర్ ఎందుకని ప్రశ్నించారు. జిన్నా టవరుకు అబ్దుల్ కలాం పేరు   విశాఖలో కింగ్ జార్జ్ ఆస్పత్రికి అల్లూరి సీతారామారాజు పేరు పెట్టాలన్నారు.  మీ కంపెనీలకు మీ పేర్లు పెట్టుకొండి.. ప్రజాధనంతో ఏర్పాటైన సంస్థలకు మీ పేర్లెందుకు..? పోలవరానికి కేంద్రం నిధులిస్తోంది కదా..? వాజ్ పేయి పేరు పెట్టండని డిమాండ్ చేశారు.