Telangana Politics :  ధాన్యం  సేకరణ అంశంపై ప్రతీ సారి  బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే యుద్ధం జరిగేది. ఇందులో కాంగ్రెస్ అనే మాటే వినిపించేది కాదు.  మోదీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని..  అవమానించారని బీఆర్ఎస్ ధర్నాలు చేసేది.  కేంద్రంలో తీసుకునే ప్రతీ నిర్ణయానికి విరుద్ధంగా తెలంగాణలో దర్నాలు చేసి..బీజేపీపై యుద్ధం ప్రకటించేది .  ఇలా రెండుపార్టీల మధ్య వార్ .. గత రెండు, మూడేళ్ల నుంచి సాగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మూడో స్థానంలోనే ఉండేది.  అసలు ఇష్యూలో లేకపోవడమో.. లేకపోతే..  ఎదైనా స్టాండ్ తీసుకున్న ఏదో ఓ పార్టీ వాదనకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితో వచ్చేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫేట్ మారిపోయింది. కాంగ్రెస్ ప్లేస్ బీజేపీకి వచ్చింది.

  


కరెంట్ వార్‌లో కనిపించని బీజేపీ 


 రేవంత్ అన్న ఒక్క మాటను మూడో సారి అధికారానికి నిచ్చెనగా వేసుకోవాలని ప్రయత్నిస్తోంది.  కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తుందనే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తోంది.  అదే పవర్‌ మంటలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఇటు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌.. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ దూసుకెళ్తున్నాయి..  .. కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్‌ రద్దవుతుందని కేటీఆర్ చెబుతున్నారు.  రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలని.. .  పది రోజులపాటు రైతు సమావేశాలు జరిపుతోంది బీఆర్ఎస్.  ప్రతి రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు పెట్టి మూడు పంటలు టీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట ఈ సమావేశాల్లో చర్చించాలని బిఅర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ఆదేశాలిచ్చారు.  బీఆర్ఎస్ శ్రేణులు పాటిస్తున్నారు.


ఇరవైనాలుగు గంటల కరెంట్ లేదని ఎదురుదాడి చేస్తున్న కాంగ్రె్స 


అయితే రేవంత్ వ్యాక్యలు రివర్స్ అయ్యాయని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ  ఇరవై నాలుగు  గంటల కరెంట్ ఎక్కడా రావడం లేదన్న విధానాన్ని తెరపైకి తెచ్చింది.  బీఆర్ఎస్ ను కార్నర్ చేయడానికి ఉపయోగిచుకుంది.   విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ కు దీటైన సమాధానం ఇస్తూ అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసేందుకు  సబ్ స్టేషన్ల వద్ద చర్చకు సవాల్ చేశారు.   అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యారు. దీన్ని  రేవంత్ రెడ్డి కూడా అందుకున్నారు. ఎక్కడైనా చర్చకు సవాల్ అన్నారు. తన వ్యాఖ్యలపైనే పది రోజుల నిరసనలకు కేటీఆర్ పిలుపునివ్వడంతో రేవంత్ మరింత దూకుడుగా సవాళ్లు చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందుబాటులో ఉంచుతున్నామని రైతులకు సరిపడా ఇస్తున్నామన్న వాదన తీసుకొస్తున్నారు. కానీ ఇలా చెప్పడం వెనక్కి తగ్గడమే. అయితే ఎవరూ తగ్గకుండా...  కరెంట్ రాజకీయాన్ని జోరుగా నడిపించుకుంటున్నారు. 


విదేశాల్లో కిషన్ రెడ్డి - నేతలంతా సైలెంట్ 


పవర్ వార్‌లో  తామిద్దరమే పోటీ పడుతున్నామన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ - కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి.  తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అన్నట్లుగా బీఆర్ఎస్  వ్యవహరిస్తోంది.  రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర పూరితంగా రాజకీయాలు కూడా తమ మధ్యే జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.  పాత విషయాల్ని తెరపైకి తెచ్చి..  గట్టిగా పోరాడుతున్నట్లుగా  కనిపించేందుకు  ప్రయత్నం చేస్తున్నారు.     ఈ బీజేపీని కనిపించనీయకుండా చేస్తున్న రాజకీయంలో... ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతర్గత పరిణామాల కారణంగా బీజేపీ నేతలు...  మాట్లాడలేకపోతున్నారు.  కొత్త తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అధికారిక పనుల్లో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇతర నేతలకు ఈ ఇష్యూలో  ఎలా స్పందించాలో స్పష్టత లేకుండా పోయింది.   ఇలాంటి సమయంలో  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఊహించని సవాళ్లు ఎదురు అవుతున్నాయి. ఆయన ఈ పరిస్థితుల్ని అధిగమించి.. పార్టీని గాడిన పెట్టాల్సి ఉంది.