CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Andhra News: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.

Continues below advertisement

CM Chandrababu Comments In AP Assembly: రాష్ట్రంలో పెట్టుబడులపై దృష్టి సారించి అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అసెంబ్లీలో 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్‌పై అసెంబ్లీలో (AP Assembly) చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. భద్రత లేకుంటే ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రూపొందించాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారు. మనం స్వర్ణాంధ్ర - 2047తో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలపై గురుతర బాధ్యత ఉంది. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి. ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారు.' అని సీఎం పేర్కొన్నారు.

Continues below advertisement

'వ్యవస్థలు విధ్వంసం'

వైసీపీ ప్రభుత్వం అక్రమాలపై లోతులోకి వెళ్లే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయని.. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇన్ని తప్పులు చేయరని చంద్రబాబు అన్నారు. 'గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం నిర్వర్యమైంది. రాష్ట్ర అప్పులు తీవ్రస్థాయికి చేరాయి. తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు. అసత్యాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు. ఇది చాలా దురదృష్టకర రాజకీయం. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి విచిత్ర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల్లో ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు. 1995లో తొలిసారి నేను సీఎం అయినప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రజలకు చెప్తే సహకరించారు. అనివార్య కారణాలతో రూ.2 కిలో బియ్యం ధర పెంచాల్సి వచ్చింది. 1999లో విజన్ - 2020 తీసుకొచ్చాం. నాలెడ్జ్ ఎకానమీకి హైదరాబాద్ చిరునామాగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భద్రత ఉండాలి. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. వారికి చెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంది.' అని సీఎం వెల్లడించారు.

వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందన్నారు. 'ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం.' అని తెలిపారు.

Also Read: Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్

Continues below advertisement