Miss World 2025: వేయిస్తంభాల గుడిలో జన్‌జీ దేవకన్యలు - రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ బ్యూటీస్
హైదరాబాద్ నుంచి హనుమకొండ హరిత హోటల్‌కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులకు ఘన స్వాగతం లభించింది.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు సుందరీమణులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు.
సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్థానికులు సాదదరంగా ఆహ్వానించారు.
రెండు జట్లుగా విడిపోయిన పోటీదారులు ఒక టీం రామప్పను సందర్శించింది. మరో టీం వేయిస్తంభాల ఆలయాన్ని విజిట్ చేసింది.
కాకతీయుల చారిత్రక కట్టడాల వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది.
అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కెనడా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, ఎల్ సాల్వేడార్, గ్వాటేమాల, హైతీ, హోండూరస్, మెక్సికో, నికరాగ్వా, పరాగ్వే, పనామా, పెరూ, అమెరికా, సూరి నామ్, వెనుజుల, బెలిజ్ దేశాలకు చెందిన సుందరీమణులకు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు
ప్రవేశ మార్గం వద్ద సుందరీమణులకు పుష్ప గుచ్ఛాలతో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్, రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వాగతం పలికారు.
సాంప్రదాయ చీర కట్టులో వివిధ దేశాల సుందరీమణులు ఆలయ సందర్శనకు వచ్చారు.
ఆలయ ఆవరణలో ఉన్న కోనేరు పరీశీలించారు. వేయి స్తంభాల దేవాలయం ప్రాశస్త్యాన్ని వివరించే శిలా శాసనాన్ని పరిశీలించిన సుందరీమణులు.
శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్రని వివరించిన గైడ్.
సాంప్రదాయం ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలో చెంబులో ఉన్న నీళ్లతో వివిధ దేశాల సుందరీమణులు కాళ్లు కడుక్కున్నారు.
ఆలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫోటో షూట్‌లో సుందరీమణులు పాల్గొన్నారు.
నంది చెవులో కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని నమ్మకంతో సుందరీమణులు వారి కోరికలను చెప్పుకున్నారు.
కల్యాణ మంటపాన్ని దర్శించారు.
కల్యాణ మంటపాన్ని దర్శించారు.
ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు.
సుందరీమణుల బృందానికి ఆదివాసీ గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శన ద్వారా ఆత్మీయ ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనాలు అందజేశారు.
వేద పండితులు అందించిన తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు.
వరల్డ్ హెరిటేజ్ దేవాలయం రామప్ప ఆలయాన్ని 35 దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణుల టీమ్ సందర్శించింది.