In Pics: మంత్రి ఎర్రబెల్లి జోష్ మామూలుగా లేదు - చెట్టెక్కి కల్లు తీసి, తాగిన మంత్రి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు వివాహాలకు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆయన చెట్టెక్కి మరీ తాటికల్లు తాగారు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును తాగి..వావ్ సూపర్ అంటూ కితాబిచ్చారు.
అనుకున్నదే తడువుగా నిచ్చెనతో గిరక తాటి చెట్టు ఎక్కారు. కల్లుకు కట్టిన లొట్టిని కిందకు దించారు. ఆ తర్వాత అందరూ తలా కొంచెం పంచుకుని తాగారు.
మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి మొక్కలను పంపిణీ చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేసిన గిరక తాటి మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి..కల్లు అందిస్తున్నాయి.
దీన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పంపిణీ చేసిన గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి.. ఆ కల్లును తాగారు.
తాటి చెట్ల కంటే గిరక తాటి చెట్లు చిన్నవిగా ఉంటాయి. వంద అడుగుల తాటి చెట్లు ఎక్కడం కంటే 10 నుంచి 20 అడుగుల ఎత్తున్న గిరక తాటి చెట్లు ఎక్కడం ఈజీ
అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో గౌడ లకు గిరకతాటి చెట్లను పంపిణీ చేసింది. సాధారణ తాటి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి పంట పెట్టిన 14 సంవత్సరాలకు గాని గీతకు రాదు.
కానీ బీహార్ రాష్ట్రానికి చెందిన గిరక తాటి చెట్లు 20 అడుగుల ఎత్తులో ఉండి కేవలం ఐదేళ్లకే గీతకు వస్తాయి. అలాగే 100 తాటికాయలు వరకు దిగుబడినిస్తాయి.