Warangal Photos: వరంగల్‌లో తప్పక చూడాల్సిన చారిత్రక ప్రదేశాలు ఇవే
వరంగల్ కాకతీయ రాజవంశీకుల పురాతన రాజధాని. ఓరుగల్లు, ఏకశిలా నగరం, ఒంటికొండ వంటి వివిధ పేర్లతో పిలిచేవారు. వరంగల్ నగరంలో చారిత్రాత్మక దర్శనీయ ప్రదేశాలు, పురాతన కట్టడాలు ఉన్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకతీయులు నిర్మించిన వేయి స్తంభాలు దేవాలయం. శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన మూర్తిగా లింగ రూపంలో కొలువై ఉన్నారు. హన్మకొండ బస్ స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కాకతీయుల కాలంలోని మరో చారిత్రక ఆలయం శ్రీ భద్రకాళి దేవాలయం. వేయి స్తంభాల అలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కాకతీయుల రాజధాని వరంగల్ కోట. ఈ కోటను కేంద్రంగా చేసుకొని కాకతీయులు పాలనను సాగించారు.
కోట లోపలికి వెళ్లాలంటే మొదట మట్టి కోట, రాతి కోట ను దాటుకుంటూ కోటలోపలికి వెళ్లాలి.
కోట లోపలికి వెళ్ళగానే ఖుష్ మహల్ , కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాలు కనువిందు చేస్తాయి.
భద్రకాళి దేవాలయం నుంచి వరంగల్ కోటకు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
వరంగల్లులో భద్రకాళీ దేవస్థానం ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్- హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో విరాజిల్లుతూ ఉంది
శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండగగా భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది.
కాకతీయ రాజవంశం వరంగల్ కోటను నిర్మించింది.కోటలో నాలుగు ద్వారాలు ఉన్నాయి, వీటిని కాకతీయ కళా తోరణం అని పిలుస్తారు. ఈ కోట UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకుంది.