Ramoji Rao: రామోజీరావుకు చంద్రబాబు, నారా లోకేశ్ దంపతుల నివాళి
రామోజీరావు పార్థీవదేహానికి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి నివాళి అర్పించారు.
రామోజీరావు పార్థీవదేహానికి చంద్రబాబు దంపతులు నివాళి అర్పించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ఓ వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అని కొనియాడారు.
రామోజీరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు.
రామోజీరావు పార్థీవదేహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళి అర్పించారు.
రామోజీరావు పార్థీవదేహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళి అర్పించారు. మీడియా, పత్రికా రంగాలకు ఆయన చేసిన సేవలను లోకేశ్ కొనియాడారు.
రామోజీరావు కుటుంబ సభ్యులను నారా లోకేశ్, బ్రాహ్మణి పరామర్శించి ధైర్యం చెప్పారు.
రామోజీరావు పార్థీవ దేహానికి జనసేనాని పవన్ కల్యాణ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ నివాళి అర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.