OU 81st Convocation: ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం.. హాజరైన గవర్నర్ తమిళిసై
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో నేడు 81వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుధవారం ఉదయం 9.30 గంటలకు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్నాతకోత్సవం నిర్వహించారు.
స్నాతకోత్సవానికి ఓయూ ఛాన్స్‌లర్ హోదాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీవో చైర్మన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖల కార్యదర్శి డా. సతీశ్‌రెడ్డి హాజరయ్యారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా వాయిదా పడుతున్న కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు.
2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు స్వర్ణ పతకాలు, 350 మంది విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు.
వారితో పాటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్వర్ణ పతకాలు సాధించిన మెరిట్ విద్యార్థులకు, వారి కాలేజీలకు పతకాలను పంపిస్తామని ఓయూ అధికారులు తెలిపారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందినప్పుడు, అది ఎంతగా ప్రయత్నిస్తుందో.. సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా దాని రెక్కలు బలంగా తయారవుతాయన్నారు.
2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు స్వర్ణ పతకాలు, 350 మంది విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారు.
విద్యార్థులు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవటానికి వెనకడుకు వేయవద్దని, సిగ్గుపడకుండా వాటిని ఎదుర్కొనేందుకు మరియు బలమైన వ్యక్తిగా మారాలని విద్యార్థులకు ఆమె సూచించారు.