In Pics: బెంగళూరు దేవేగౌడతో కేసీఆర్ భేటీ, వెండి కంచాల్లో గ్రాండ్ లంచ్ - ఫోటోలు
ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు.
గురువారం (మే 26) మధ్యాహ్నం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు.
బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు కుమార స్వామి ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు.
దేవెగౌడ ఇంట్లోనే కేసీఆర్ సహా ఆయన వెంట వెళ్లిన టీమ్ అంతా భోజనం చేశారు. వెండి కంచాల్లో అద్భుతమైన ఆతిథ్యం అందించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి చర్చించారు.
భవిష్యత్తు కార్యాచరణపై కూడా దేవెగౌడ, కుమార స్వామితో కేసీఆర్ చర్చించారు.
త్వరలో జరగాల్సి ఉన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో ఆయన కటౌట్‌తో ఫ్లెక్సీలను రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు.
దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భేటీ ముగిశాక సాయంత్రం 4 గంటలకు తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్ రానున్నారు.