In Pics: అక్కినేని అఖిల్ బ్యాటింగ్, మంత్రి హరీశ్ బౌలింగ్.. సిద్దిపేటలో సందడి
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, హీరో అక్కినేని అఖిల్ సందడి చేశారు.
నగరంలోని ఓ గ్రౌండ్‌లో అభిమానుల మధ్య వీరు క్రికెట్ ఆడి అలరించారు.
ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో 4 వేల మంది క్రీడాకారులతో 258 జట్లు పాల్గొంటున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని గురువారం రాత్రి వీరిద్దరూ ప్రారంభించారు.
బ్యాటింగ్, బౌలింగ్ చేసి అక్కడున్న వారిని అలరించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చాముండేశ్వరనాథ్‌తో కలిసి కేక్ కట్ చేశారు.
ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ ఆదర్శమని, క్రీడాకారులు పట్టుదలతో రాణించాలని హరీశ్ రావు అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ.. సిద్దిపేట విద్య, క్రీడలకు హబ్‌గా మారిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం కోమటిచెరువు ప్రాంతాన్ని అక్కినేని అఖిల్ సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి విశేషాలను మంత్రి అఖిల్‌కు వివరించారు. రంగనాయక సాగర్‌ను కూడా వీరు సందర్శించారు.