Godavari Floods: గోదారమ్మా శాంతించు - మంత్రి పువ్వాడ నది హారతి, పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గోదావరి నది వద్ద వరద ఉధృతిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎగువ నుండి గోదావరికి భారీగా వరద నీరు రావడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుందని, రాగల 24గంటల్లో ప్రవాహం తగ్గి నిలకడగా మారుతుందని అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గోదావరికి ప్రత్యేక పూజలు చేసి, నది హారతినీ ఇచ్చారు.
CCLA డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సింగరేణి CMD శ్రీధర్, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి వినీత్ తదితరులు ఉన్నారు.
భద్రాచలం - చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. అటుగా ఎవరి వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలని జిల్లా ఎస్పీ వినీత్ ను అదేశించారు.
గోదావరి నది వరద బాధితుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ సందర్శించారు. వారిని కలిసి మాట్లాడారు. అక్కడ అందుతున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు
సహాయక చర్యల్లో పాల్గోని బాధితులకు ధైర్యం చెప్పి పునరావాస కేంద్రంలోకి వెళ్ళాలని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.