In Pics: టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. కేటీఆర్, హరీశ్ రావు కూడా ఫ్లకార్డులు చేతబట్టి.. కనిపించని కేసీఆర్

యాసంగి సాగులో వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని, ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నాలు నిర్వహిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
రైతుల వద్ద కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ మినహా అందరూ ధర్నాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తమ తమ నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటల్లో నిరసన చేపట్టారు.
ఈ ధర్నాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అధికార టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీగా తరలివచ్చారు. యాసంగి వడ్లు కొంటరా..? కొనరా ? అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో నాయకులు నిరసన తెలిపారు.
కేంద్రం వరి కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పేవరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.
యాసంగి వడ్లు కొనే వరకూ ఉద్యమం నిర్వహిస్తామని చెబుతున్నారు. కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పిందని అందుకే వరి పంట వేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని కోరుతోంది.
అయితే బీజేపీ మాత్రం కేంద్రం అలా చెప్పలేదని టీఆర్ఎస్ రైతుల్ని మోసం చేస్తోందని మండిపడుతున్నారు.
కేటీఆర్ అభిమానులు మాత్రం.. ఉద్యమ సమయంలోని ఫోటోను, ఇప్పటి ఫోటోలను ఇలా జత చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.