Indrakaran Reddy Worship Pics: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు
ABP Desam | 03 Aug 2021 04:52 PM (IST)
1
హైదరాబాద్‌లో బోనాల పండుగ కన్నుల పండువగా జరుగుతోంది. గతేడాది కరోనా వల్ల బోనాలను అంతంత మాత్రంగానే నిర్వహించిన సంగతి తెలిసిందే.
2
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సామాన్యులే కాక, ప్రముఖులు సైతం బోనాల పండుగలో పాల్గొంటున్నారు.
3
ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
4
అనంతరం ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
5
మంత్రి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనానికి రావడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ఆలయానికి వచ్చారు.