At Home at Rashtrapati Nilayam: రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమం- గవర్నర్, సీఎం సహా ప్రముఖులు హాజరు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్నారు.
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి సాదరస్వాగతం పలకగా.. అనంతరం రాష్ట్రపతి అందించిన ఆతిథ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నాయకులు, అధికారులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.
సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు.
రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం