TRS Leaders Protest: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణుల నిరసన తెలిపారు. (Photo Credit: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసనలో పాల్గొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. (Photo Credit: Twitter)

రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. (Photo Credit: Twitter)
మొదట బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిపి పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నేతల దిష్టి బొమ్మను దహనం చేశారు. (Photo Credit: Twitter)
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ (Photo Credit: Twitter)
ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. (Photo Credit: Twitter)
ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. (Photo Credit: Twitter)
మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆధ్వర్యంలో అజంపురలో టీఆర్ఎస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. (Photo Credit: Twitter)
తెలంగాణపై మరోమారు విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని వ్యాఖ్యల పట్ల తాము నిరసన తెలుపుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. (Photo Credit: Twitter)
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. (Photo Credit: Twitter)
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు (Photo Credit: Twitter)