Statue Of Equality: ముచ్చింతల్ సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి దంపతులు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి స్వాగతం పలికారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరామానాజాచార్యుల 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులోని రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు.
రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
సమతాస్ఫూర్తి కేంద్రంలో శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.
హైదరాబాద్ ముచ్చింతల్ లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సందర్శించారు. ఆశ్రమంలోని 108 దివ్యక్షేత్రాలకు దర్శించుకున్నారు.
ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా పేరుగాంచుతుందన్నారు.
రామానుజాచార్యులు విశిష్ట అద్వైత సిద్ధాంతాలు బోధించారని, ఆయన సామాజిక అసమానతలు రూపుమాపారని రాష్ట్రపతి అన్నారు.
సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి రాష్ట్రపతి దంపతులకు వివరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు