TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకగా ప్లీనరీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇన్నేళ్లు పార్టీతో ట్రావెల్ చేసిన శ్రేణులకు, ప్రజలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులు, 60 లక్షల మంది సభ్యులతో సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న టీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు కేసీఆర్.
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ
వ్యవసాయంలో తెలంగాణ సాధించిన ప్రగతి చెబుతూనే కేంద్ర చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వ్యవసాయ తీర్మానాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రవేశ పెట్టారు.
తెలంగాణ మోడల్‌తో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పే తీర్మానాన్ని మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు.
ఆకాశాన్ని అంటేలా ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేస్తున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ ఓ తీర్మానం చేసింది టీఆర్‌ఎస్..
చట్టసభల్లో మహిళలకు 33 శాంతి రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. తెలంగాణరాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయిస్తూ మరో తీర్మానం చేసింది.
బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగమన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది టీఆర్‌ఎస్.
రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌రూపేణా వసూలు చేయడం మనుకోవాలనీ... డివిజబుల్ పూల్‌లోనే పన్నులను వసూలు చేయాలని తీర్మానం చేసింది.
నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని.. ఈ మరేకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరినకి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు.
తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జి.ఎస్.టి.ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, చేనేత రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తీర్మానం చేసింది
స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా ప్రజలకు లభించడం లేదు. పెడధోరణులు ప్రబలిపోతున్నాయి. దేశంలో కొన్ని అవాంఛితమైన, అనారోగ్యకరమైన పోకడలు చూస్తున్నాము
ఒక రాజకీయ పార్టీగా దేశ అభ్యున్నతి కోసం కీలక నిర్ణయం తీసుకోవాలి. దేశంలో 4 లక్షల మెగావాట్లు విద్యుత్ శక్తి ఉంటే ఏ ఒక్క రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ వాడడం లేదు
ఆఖరికి గుజరాత్‌లో కూడా భయంకరమైన కరెంటు కోతలు ఉన్నాయి. దేశంలో కరెంటు కోతలు లేని రాష్ట్రమే లేదు.
చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా తెలంగాణ వెలుగుతోంది. తెలంగాణ అనుసరించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వడం లేదు
చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్త శుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అద్భుత అవకాశాలను భారత్ కలిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని సీఎం కేసీఆర్ అన్నారు