Secunderabad Railway Station న్యూ డిజైన్ చూశారా - ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలు ఇవీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.
దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రీడిజైన్ చేయనున్నారు
అందుకోసం కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ స్టేషన్ రూపు రేఖలు మార్చేందుకు అంచనా వ్యవయం రూ.719 కోట్లుగా నిర్ణయించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్స్ విశ్రాంతి కోసం అత్యంత విలాసవంతమైన లాంజ్‌లు, రైళ్ల రాకపోకలను కచ్చితంగా తెలిపే సమాచార వ్యవస్థను కల్పించే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ పర్యటనకు రానున్న ముందు రోజు ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ న్యూ డిజైన్ ఫొటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.