In Pics: టీఆర్ఎస్ మహా ధర్నా.. వరి కంకులతో నేతలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ధర్నా వేదికపై నిరసన చేపట్టారు.
వేదికపై కూర్చొని ప్రకార్డులు ప్రదర్శిస్తూ.. వడ్లు కొనబోమన్న కేంద్ర నిర్ణయాన్ని ఎండగట్టారు. అక్కడ వేదికపై వరి కంకులను ప్రదర్శించారు.
కేంద్ర ప్రభుత్వం వరి పంటను తెలంగాణ నుంచి కొనాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఈ పోరాటం చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.
‘‘ఈ పోరాటం ప్రారంభం మాత్రమే. ఇది ఇప్పటితో ఆగదు. గ్రామాల్లోనూ ఈ పోరాట వ్యూహాలను అమలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం సాగుతుంది.’’ అని సీఎం అన్నారు.
టీఆర్ఎస్ మహా ధర్నాకు హాజరైన పార్టీ కార్యకర్తలు, రైతులు
ధర్నా వేదికపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ధర్నా వేదికపై మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
మంత్రి కేటీఆర్ ప్లకార్డు ప్రదర్శన
ధర్నా వేదికకు వస్తున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
వేదిక వద్ద మంత్రి గంగుల కమలాకర్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసన
కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా కల్వకుంట్ల కవిత నిరసన