Agnipath Protests Photos: సికింద్రాబాద్ స్టేషన్‌లో అల్లకల్లోలం, రైళ్లకు ఆందోళనకారులు నిప్పు - పోలీసుల ఫైరింగ్

నిన్నటివరకూ ఉత్తరాధి రాష్ట్రాల్లో చెలరేగిన అగ్నిపథ్ వివాదం నేడు తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యూలర్ గా సైన్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోతుంది. ఆందోళనకారులు చెలరేగడంతో పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో కొన్ని గంటల వ్యవధిలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ చెప్పారు.
ఆర్మీ విద్యార్థుల ఆకస్మిక దాడితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అల్లర్లు మొదలుకావడంతో కొందరు ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. రైల్వే ఆస్తులకు తీవ్రంగా నష్టం కలిగించడంతో ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు ఫైరింగ్ మొదలుపెట్టారు.
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు.
ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది.
నాలుగేళ్ల సర్వీసు తరువాత ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ఆందోళనకు గురై నిరసనకు దిగి విధ్వంసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.