KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అజ్మీర్ దర్గాకు ‘చాదర్’ ను సమర్పిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ‘చాదర్’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ ఏడాది కూడా సమర్పించారు.
ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో బుధవారం దైవ ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు సిఎం కేసీఆర్ వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు.
తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రిని చల్లగా చూడాలని, రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ఈ సందర్భంగా వారు ప్రార్థించారు.
హోం మంత్రి మహమూద్ అలీ, సాంఘీక, మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి.. మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్., ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడెమీ చైర్మన్ ఖాజా మొజీబుద్దీన్, ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఆర్టీఐ కమిషనర్ మహమ్మద్ అమీర్, తదితరులు పాల్గొన్నారు.