Tech Tips: ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవుతుందా? ఈ టిప్స్ పాటించి చూడండి..
కోవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా మన జీవన శైలిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. ఇక పాఠశాలలు కూడా తమ విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదని ఆన్‌లైన్ విధానంలోనే చదువులు కొనసాగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి అవసరమయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేలకు వేలు ఖర్చు చేసి కొన్న ల్యాప్‌టాప్ వేగంగా పనిచేయకుండా అస్తమానం స్ట్రక్ అవుతుంటే చదువు, పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి. ల్యాప్‌టాప్ పనితీరు మందగించి కొన్ని సార్లు వేడెక్కడం, హ్యాంగ్ అవడం వంటివి కూడా జరుగుతుంటాయి. మరి ల్యాప్‌టాప్స్ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి?
ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో మెమరీ ఫుల్ అవడం కూడా ఒకటి. మన ల్యాప్‌టాప్‌లో ఇంటర్నల్ మెమరీ ఫుల్ అయి ఉంటే పనిచేసే వేగం తగ్గి, స్ట్రక్ అవుతుంటుంది. కాబట్టి మనకు అనవసరమైన సమాచారం ఏమైనా ఉందేమో చెక్ చేసి, ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి.
ల్యాప్‌టాప్ మరింత వేగంగా పనిచేయాలంటే అప్లికేషన్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. వీటి వల్ల స్పీడ్ తగ్గకుండా ఉంటుంది. అప్‌డేట్స్‌ను ఆటో మేటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా ఎంచుకోవాలి. అలాగే మనం ఏమైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రాసెసర్‌పై పడుతుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే యాంటి స్పైవేర్, యాంటీ మాల్‌వేర్ వంటివి ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ల్యాప్‌టాప్‌లలో భద్రత చాలా ముఖ్యమైన అంశం. మనం ల్యాప్‌టాప్ ఉపయోగించేటప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్ బ్రౌజర్, ఇతర వ్యక్తిగత యాప్‌లను వాడాక వాటి నుంచి సైన్‌అవుట్ చేయకుండా వదిలేస్తుంటాం. దీని వల్ల మాల్‌వేర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ల్యాప్‌టాప్‌లకు స్క్రీన్ లాక్ తప్పనిసరిగా ఉంచాలి.