Dangerous Mobile Mistakes : ఫోన్ వాడకంలో చాలామంది చేసే పెద్ద తప్పులు ఇవే.. వీటితో మొబైల్‌ను నాశనమైపోద్ది
ఎక్కువమంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. ఏదైనా యాప్‌ని డౌన్లోడ్ చేసేప్పుడు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్ నుంచి ఇన్స్టాల్ చేస్తారు. బయట నుంచి డౌన్లోడ్ చేసిన యాప్లలో వైరస్లు, స్పైవేర్ లేదా ట్రోజన్లు ఉండవచ్చు. ఇవి మీ ఫోన్ భద్రతను ఉల్లంఘించి వ్యక్తిగత డేటా, పాస్వర్డ్లు, కెమెరా-మైక్లకు కూడా యాక్సెస్ తీసుకుంటాయి. ఇవి ఫోన్ వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతుంది. సురక్షితంగా ఉండటానికి యాప్‌లను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
ఫోన్ వేడెక్కినప్పుడు కూడా చాలామంది ఛార్జింగ్ పెడతారు. ఇది బ్యాటరీకి చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. వేడి ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. దాని జీవితకాలం కూడా తగ్గుతుంది. ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ కవర్ తీసివేయాలి. తద్వారా వేడి బయటకు వెళ్లవచ్చు. అలాగే ఫోన్‌ను ఎండలో, వేడి ఉపరితలంపై లేదా తేమతో కూడిన ప్రదేశంలో ఎప్పుడూ ఛార్జ్ చేయకూడదు. ఇది బ్యాటరీకి శాశ్వత నష్టం కలిగిస్తుంది.
ఫోన్ అప్డేట్లను నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే. చాలామంది వినియోగదారులు అప్డేట్ నోటిఫికేషన్ చూసి దానిని వాయిదా వేస్తారు. అయితే ఈ అప్డేట్లు ఫోన్ను వేగంగా, సురక్షితంగా ఉంచేందుకు అవసరం. కొత్త అప్డేట్లలతో భద్రత పెరుగుతుంది. బగ్ పరిష్కారమవుతాయి. వైరస్లు, హ్యాకింగ్ నుంచి రక్షిస్తాయి. అందువల్ల అప్డేట్ వచ్చిన వెంటనే.. వై-ఫైలో ఇన్స్టాల్ చేయడం మంచిది.
అంతేకాకుండా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవ్వడం కూడా మీ గోప్యతకు ప్రమాదం కలిగించవచ్చు. ఓపెన్ నెట్‌వర్క్‌లలో, హ్యాకర్లు మీ ఫోన్ నుంచి డేటాను సులభంగా దొంగిలించవచ్చు. లేదా మాల్వేర్‌ను పంపవచ్చు. ఇంటర్నెట్ వాడకం తప్పనిసరి అయితే.. సురక్షితమైన, పాస్‌వర్డ్-రక్షిత నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ వంటి సున్నితమైన పనుల కోసం.
దాదాపు ప్రతి ఒక్కరూ చేసే తప్పుల్లో ఇది కచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఇతరుల ఛార్జర్స్ వాడతారు. లేదా చవకైన, నకిలీ ఛార్జర్లు వాడుతారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పాడు అవుతుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా దెబ్బతినవచ్చు. ఫోన్‌కు సరైన వోల్టేజ్, యాంపియర్‌లు అందేలా అసలైన, నాణ్యత గల సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించాలి.