✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

iPhone Ban Story : ఆ దేశంలో ఐఫోన్ నిషేదం.. చౌకగా దొరికే దేశమేంటో.. వాటి వెనుక కారణాలు ఇవే

Geddam Vijaya Madhuri   |  07 Sep 2025 01:12 PM (IST)
1

అక్టోబర్ 2024లో ఇండోనేషియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఐఫోన్ 16పై నిషేధం విధించింది. ఎందుకంటే ఆపిల్ ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని వాగ్దానం చేసింది. కానీ 1.71 ట్రిలియన్ రూపాయిల వాగ్దానంలో కేవలం 1.48 ట్రిలియన్ రూపాయిలు మాత్రమే పెట్టుబడి పెట్టింది. దీనివల్ల TKDN/IMEI సర్టిఫికెట్ జారీ కాలేదు. దీంతో అక్కడ ఫోన్ అమ్మకాలు చట్టవిరుద్ధంగా ప్రకటించారు.

2

ఆపిల్ తరువాత తన ప్రతిపాదనను 1 బిలియన్ డాలర్లకు పెంచింది. బాటమ్ ద్వీపంలో ఎయిర్ట్యాగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇండోనేషియా పరిశ్రమల మంత్రి అగస్ గుమివాంగ్ ఇది సరిపోదన్నారు. ఐఫోన్​లో ఉపయోగించే పార్ట్స్​లో స్థానికంగా తయారు చేసినవి కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఆపిల్ 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి, స్థానిక R&D, తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకుని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2025లో ఆపిల్, ఇండోనేషియా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దీని తరువాత ఐఫోన్ 16పై నిషేధం తొలగించింది.

3

ఇండోనేషియాలో Apple iPhone 17ని విడుదల చేసి అమ్మాలనుకుంటే దానిలో స్థానిక తయారు చేసిన మెటీరియల్స్​ ఉండాలనే నిబంధనలు కచ్చితంగా పాటించాలి. వాటిని పాటించకపోతే iPhone 17పై కూడా నిషేధం విధిస్తామని ప్రభుత్వం సూచించింది.

4

ఇప్పటివరకు ఐఫోన్‌లపై ప్రభుత్వం విధించిన పూర్తి నిషేధం ఇండోనేషియాలో మాత్రమే స్పష్టంగా అమలు చేశారు. మరోవైపు ఇరాన్‌లో ఐఫోన్ 14, 15 మోడళ్లను నిషేధించారు. దీనివల్ల వాటి ధరలు బాగా పెరిగాయి.

5

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ధరలు దేశాల వారీగా మారుతూ ఉంటాయి. పన్నులు, మారకపు రేటు, స్థానిక విధానాల కారణంగా వ్యత్యాసం ఉంటుంది. అమెరికా (USA)లో ఐఫోన్ అన్లాక్ మోడల్స్ ధర దాదాపు US$ 1,599 నుంచి ప్రారంభమవుతుంది. ఇది చాలా తక్కువగా ఉంటుంది.

6

దక్షిణ కొరియాలో iPhone 16 Pro ధర దాదాపు €903. యూరప్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. హాంగ్‌కాంగ్ పన్ను రహిత ప్రాంతం కాబట్టి ఇక్కడ సాధారణంగా ఐఫోన్‌లు చౌకగా లభిస్తాయి. US ధరల కంటే ఇవి తక్కువగా ఉంటాయి. జపాన్, కెనడా, UAE వంటి ఇతర దేశాలు తక్కువ పన్నులతో వస్తాయి. ఇవి మంచి ధరలకే అందుబాటులో ఉంటాయి.

7

మరోవైపు టర్కీలో ఐఫోన్ ధర అమెరికా ధర కంటే రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రత్యేక వినియోగ పన్ను (ÖTV), వ్యాట్ (VAT) చాలా ఎక్కువ. బ్రెజిల్, కొన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఐఫోన్ ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఐఫోన్ 16 అధికారికంగా అమ్మడంపై నిషేధం ఉంది. ఇరాన్​లో కొన్ని మోడల్స్ నిషేధించారు. చౌకైన ఐఫోన్ కొనాలనుకుంటే అమెరికా, దక్షిణ కొరియా మంచి ఎంపికలు. హాంగ్​కాంగ్, జపాన్, కెనడా, యూఏఈ కూడా పన్ను రహిత దేశాలు కాబట్టి తక్కువ ధరకు ఐఫోన్ కొనొచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • మొబైల్స్‌
  • iPhone Ban Story : ఆ దేశంలో ఐఫోన్ నిషేదం.. చౌకగా దొరికే దేశమేంటో.. వాటి వెనుక కారణాలు ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.