Cyber Fraud: WhatsApp లో RTO చలాన్ మెసేజ్ వచ్చిందా? పొరపాటున కూడా క్లిక్ చేయొద్దు!
RTO Traffic Challanapk అనే ఫైల్ వాట్సాప్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీన్ని డౌన్లోడ్ చేయగానే ఇది మీ ఫోన్ ను ఇన్ఫెక్ట్ చేస్తుంది. హ్యాకర్లకు మీ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ వివరాలు పాస్వర్డ్లు, OTP ల వరకు యాక్సెస్ ఇస్తుంది.
సైబర్ భద్రతా సంస్థ సైబుల్ రైల్ దీనిని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా పేర్కొంది, ఇది రిమోట్ యాక్సెస్ ద్వారా ఫోన్‌లోని ప్రతి పనిని పర్యవేక్షించగలదు. ఇటీవల కాలంలో, ప్రజల ఖాతాలు ఖాళీ చేసిన అనేక కేసులు నమోదయ్యాయి.
మోసగాళ్ళు మొదటగా తెలియని నంబర్ నుంచి RTO చలాన్ పేరుతో ఈ ఫైల్‌ను పంపుతారు. వినియోగదారుడు దీనిని నిజమైనదిగా భావించి డౌన్‌లోడ్ చేస్తాడు. ఇది అతి పెద్ద తప్పు అవుతుంది. యాప్ ఇన్‌స్టాల్ చేయగానే, హ్యాకర్లు మీ మొబైల్ SMS, కాంటాక్ట్‌లు, ఫైల్‌లు, కెమెరా, మైక్‌లకు యాక్సెస్ పొందుతారు. అప్పుడు వారు రహస్యంగా మీ డిజిటల్ కార్యకలాపాలను గమనిస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును దోచుకుంటారు.
దీనిని నివారించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఎప్పుడూ తెలియని లింక్ లేదా APK ఫైల్‌పై క్లిక్ చేయవద్దు. మీరు నిజంగా చలాన్ చెక్ చేయాలనుకుంటే, Parivahan.gov.in వంటి ప్రభుత్వ వెబ్‌సైట్‌ను లేదా మీ రాష్ట్ర RTO సైట్‌ను మాత్రమే ఉపయోగించండి. మీ ఫోన్ సెట్టింగ్‌లలోని తెలియని మూలాలు ఎంపికను ఎల్లప్పుడూ ఆఫ్ చేయండి, తద్వారా మీ అనుమతి లేకుండా ఏ యాప్ ఇన్‌స్టాల్ కాదు.
WhatsAppలో వచ్చిన ప్రతి మెసేజ్‌ను నమ్ముతూ ఓపెన్ చేయడం సురక్షితం కాదు. గుర్తు తెలియని వ్యక్తులు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేయానికి చూస్తున్నారు. కాబట్టీ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఏదైన సందేహం లింక్ ని తెరచే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటె ఒక క్లిక్ మీకు సమస్త డిజిటల్ లోకాన్ని ప్రమాదంలో పడేస్తుంది.